విజయ్ దేవరకొండ పేరు మార్చుకోబోతున్నారా.. కారణం .!

రౌడీ హీరోగా ఎంతో గుర్తింపు పొందారు విజయ్ దేవరకొండ(vijay devarakonda). గీతా గోవిందం చిత్రంతో మంచి హిట్టు అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని

విజయ్ దేవరకొండ పేరు మార్చుకోబోతున్నారా.. కారణం .!
X

న్యూస్ లైన్ డెస్క్: రౌడీ హీరోగా ఎంతో గుర్తింపు పొందారు విజయ్ దేవరకొండ(vijay devarakonda). గీతా గోవిందం చిత్రంతో మంచి హిట్టు అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని సినిమాలు కాస్త డిజాస్టర్ అయ్యాయి. దీని తర్వాత వచ్చినటువంటి ఖుషి(kushi) సినిమా ఓ మోస్తరుగా హిట్ అయింది. ఈ విధంగా వరుసగా హిట్లు అందుకొని ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ అందుకున్నటువంటి విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అయితే ఆయనకు భారీ హీట్ పడాలి అంటే జాతకంలో కొన్ని మార్పులు చేయాలని సిద్దాంతులు చెప్పారట.

దీంతో ఆలోచనలో పడ్డ విజయ్ దేవరకొండ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీని గురించి వారి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారట. అయితే ఆయన జాతకం సిద్ధాంతులకు చూపిస్తే వారు పేరులో మార్పులు చేసుకోవాలని చెప్పారట. దీనిపై పెద్దగా దృష్టి పెట్టిన విజయ్ దేవరకొండ తన తల్లి కోరిక మేరకు పేరు మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈయన పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతోంది.

విజయ్ దేవరకొండ అంటే యూత్ లో ఎంతో క్రేజ్ ఉన్నది. అలాంటి ఈ తరుణంలో పేరులో మార్పులు చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందో లేదో చెప్పలేము కానీ ఆయన పేరు మాత్రం కాస్త డల్ అయిపోతుందని చెప్పవచ్చు. మార్పు చేసిన తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి క్రేజ్ కోల్పోతారని కొంతమంది అంటున్నారు. ఇన్ని వ్యతిరేక అంశాల మధ్య విజయ్ దేవరకొండ పేరు మార్చుకుంటారా లేదా అనేది మన ముందు ముందు తెలుస్తుంది.

Tags:
Next Story
Share it