Kalki 2898 AD: కల్కి ట్రైలర్ లో ఇది గమనించారా.?

గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నటువంటి కల్కి (kalki)సినిమా ట్రైలర్ రానే వచ్చేసింది. ఎన్నో అంచనాలను తలకిందులు చేసి ట్రైలర్ మరింత

Kalki 2898 AD: కల్కి ట్రైలర్ లో ఇది గమనించారా.?
X

న్యూస్ లైన్ డెస్క్:గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నటువంటి కల్కి (kalki)సినిమా ట్రైలర్ రానే వచ్చేసింది. ఎన్నో అంచనాలను తలకిందులు చేసి ట్రైలర్ మరింత ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చూస్తే మాత్రం హాలీవుడ్ మూవీ ని కూడా తలదన్నేలా ఉందని చెప్పవచ్చు. డైరెక్టర్ నాగ్ అశ్విన్(nag ashwin) అద్భుతంగా సినిమాను సృష్టించారు. ఈ ట్రైలర్ చూడగానే కథ యొక్క నేపథ్యమేంటో అర్థం అవుతుంది. వివరాలు ఏంటో చూద్దాం.

ఈ ట్రైలర్ చూడగానే ప్రేక్షకులందరికీ మైండ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ చిత్రంలో ప్రభాస్ (prabhas)క్యారెక్టర్ ఎంత గొప్పగా ఉంటుందో అర్థమవుతుంది. ఇందులో ఎవరు హీరో ఎవరు విలన్ అనేది కూడా చాలా క్లారిటీగా చూపించారు డైరెక్టర్. ట్రైలర్ ప్రకారం ప్రపంచంలో గాలి, నీరు, ఆహారం స్వచ్ఛంగా పుష్కలంగా ఉన్నటువంటి కాంప్లెక్స్ లోకి వెళ్లాలనేది భైరవ యొక్క కోరిక. దానికోసం భౌంటీ హంటర్ గా మారి తనకు వచ్చిన కాంట్రాక్ట్ ను పూర్తి చేసి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఈ టైంలోనే అతనికి వచ్చిన ఒక డీల్ జీవితాన్ని మార్చేస్తుంది. అప్పుడే అసలు యుద్ధంలోకి అడుగు పెడతాడు. అంతేకాకుండా ఈ ట్రైలర్ ప్రకారం చూస్తే మాత్రం ఇందులో నలుగురివి కీలకపాత్రలే అన్నట్టు తెలుస్తోంది.

ఇందులో ఒకటి అశ్వద్ధామ, రెండవది దీపిక పదుకొనే(Deepika padukone)మూడోది కమలహాసన్.(kamal hasson)నాల్గవది కల్కి. ఇందులో అశ్వత్థామ యొక్క పాత్ర పుట్టబోయే కల్కిని కాపాడడం. దీపిక తన బిడ్డకు జన్మనివ్వడం, కమల్ అసలు దీపిక పడుకునే పుట్టబోయే బిడ్డను పొందాలనుకోవడం. ఇందులో కల్కి ఉండే శక్తులతో అతను మంచి వాళ్ళ చేతుల్లో పడితే లోక కళ్యాణం చెడ్డవాళ్ల చేతుల్లో పడితే విశ్వనాశనం జరుగుతుందని కాన్సెప్ట్ ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా మంచి చెడు అనే రెండు కాన్సెప్ట్ లపై ఎక్కించారని అర్థమవుతుంది. మంచి కోసం ప్రభాస్ కోసం విలన్లు ప్రయత్నాలు చేసే యుద్ధమే ఈ కల్కి సినిమా అని ట్రైలర్ లో మనకు చూపించి చూపించనట్టు చూపించారు నాగ్ అశ్విన్.

Tags:
Next Story
Share it