Kalki 2898 AD: అక్కడ భారీ ఫంక్షన్.. నిజమేనా..?

ప్రభాస్,దీపికా పదుకొనే కాంబినేషన్లో రాబోతున్న తాజా మూవీ కల్కి 2898AD.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు మీడియాలో వైరల్ గా

Kalki 2898 AD: అక్కడ భారీ ఫంక్షన్.. నిజమేనా..?
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రభాస్,దీపికా పదుకొనే కాంబినేషన్లో రాబోతున్న తాజా మూవీ కల్కి 2898AD(Kalki 2898 AD).. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రభాస్ అభిమానులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అలాగే భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్(Amithab bacchan) దీక్షాసేథ్ కమల్ హాసన్ వంటి పెద్ద పెద్ద స్టార్లు కూడా నటిస్తున్నారు.

అయితే అశ్వినీ దత్ (Aswini datt) నిర్మాతగా చేస్తున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. అయితే భారీ బడ్జెట్ కల్కి 2898 ఏడి సినిమా కోసం భారీ ఈవెంట్ చేయబోతున్నారట.ఇక ఆ ఈవెంట్ ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నగరంలో చేయాలని చూస్తున్నారట.ఇక ఇప్పటికే అమరావతి(Amaravati) నగరాన్ని రాజధాని చేయాలి అని చంద్రబాబు ఎన్నో కసరత్తులు చేశారు.కానీ చివరికి జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రావడంతో అది సాధ్యం కాలేదు. జగన్ తెరమీదికి మూడు రాజధానుల పేరు తీసుకువచ్చారు.దాంతో అమరావతి మరుగున పడిపోయింది.


కానీ మళ్ళీ ఇప్పుడు 2024 లో చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం రావడంతో ఆయన అమరావతిని రాజధాని చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతికి సంబంధించి మరిన్ని పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎంతో కృషి చేస్తున్నారట.అయితే తాజాగా కల్కి సినిమాకి సంబంధించి ఒక భారీ ఈవెంట్ ని అమరావతిలో చేయాలని చూస్తున్నారట.ఈ ఈవెంట్ కోసం అశ్వినీ దత్ భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని కూడా సమాచారం.అంతేకాకుండా ఈ సినిమాలోని నటీనటుల అందరికీ స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా అమరావతికి తీసుకువచ్చి చీఫ్ గెస్ట్ గా చంద్రబాబుని ఆహ్వానించాలని చూస్తున్నారట.మరి ఈ వైరల్ అయ్యే న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది

Tags:
Next Story
Share it