Kona : ఎన్టీఆర్ ఇంటి ముందు కోన వెంకట్ నిరాహార దీక్ష

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నారు.

Kona : ఎన్టీఆర్ ఇంటి ముందు కోన వెంకట్ నిరాహార దీక్ష
X

న్యూస్ లైన్, ఫిల్మ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నారు. 2 భాగాలుగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ లో ఫస్ట్ పార్ట్ విడుదలకు రెడీ చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించాడు స్టోరీ రైటర్ కోన వెంకట్. అసలు విషయం ఏంటంటే బుధవారం కామెడీ అండ్ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో గీతాంజలికి సినిమాకు సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా వస్తుంది. ఈ సినిమాకు కోన వెంకట్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. బుధవారం మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. అనంతరం కోన వెంకట్ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రిపోర్టర్ అడిగిన ఓ ప్రశ్నకు ఎన్టీఆర్‌తో అదుర్స్‌కు సీక్వెల్ తాయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు. ఈ సినిమాలో చారిగా ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ మరెవరూ చేయలేరని చెప్పారు. దీనికి సీక్వెల్ రాయాలని తన కోరిక అన్నారు. త్వరలోనే స్టోరీ సిద్ధం చేసి ఎన్టీఆర్ ను కలుస్తానని చెప్పారు. ఈ సినిమా ఒప్పుకునేంత వరకు అవసరమైతే ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసుకొని మరీ ఒప్పిస్తానని చెప్పారు.

Tags:
Next Story
Share it