Hari Hara Veeramallu : రూమర్స్ కి చెక్ పెట్టిన 'హరి హర వీరమల్లు' టీం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా భారీ స్థాయిలో ఎదురు చూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం లో, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పై ఏఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.

Hari Hara Veeramallu : రూమర్స్ కి చెక్ పెట్టిన హరి హర వీరమల్లు టీం!
X

న్యూస్ లైన్, హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా భారీ స్థాయిలో ఎదురు చూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం లో, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పై ఏఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ 70 శాతం పూర్తి అయ్యింది. ఎప్పుడో 2020 వ సంవత్సరం లో మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయింది. లాక్ డౌన్ తర్వాత ఒక రెండు నెలలు షూటింగ్ చేసారు కానీ, మధ్యలో పవన్ కళ్యాణ్ వేరే సినిమాలకు షిఫ్ట్ అవ్వడం, ఆ తర్వాత రాజకీయాలతో బిజీ అవ్వడంతో, అసలు ఈ సినిమా ఉంటుందా, లేదా పూర్తిగా ఆపేశారా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. కొన్ని వెబ్ సైట్స్ అయితే పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' ని ఆపేసాడు, ఇప్పటి వరకు నిర్మాత పెట్టిన డబ్బులను తిరిగి ఇచ్చేస్తాడు అంటూ కథనాలు కూడా ప్రచురించారు.

ఈ నేపథ్యం లో 'హరి హర వీరమల్లు' మూవీ టీం కాసేపటి క్రితమే ఒక అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం మా ప్రతిష్టాత్మక చిత్రం హరిహరవీరమల్లు కి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్ కోసం ఇరాన్,కెనడా, బెంగుళూరు, చెన్నై మరియు హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో చేయిస్తున్నామని, ఈ సినిమాలోని గ్రాఫిక్స్ ఇది వరకు తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని, మీ ఊహలకు అందని విధంగా ఈ చిత్రం ఉంటుందని, త్వరలోనే ఫ్యాన్స్ కోసం ఒక టీజర్ ని విడుదల చేయబోతున్నాం అంటూ ఒక అధికారిక ప్రకటన చేసారు. దీంతో 'హరి హర వీరమల్లు' సినిమా ఆగిపోయింది అని ఇన్ని రోజులు సోషల్ మీడియా లో ప్రచారమైన రూమర్స్ కి చెక్ పడింది.




Tags:
Next Story
Share it