Anjali: 4 సార్లు పెళ్లి చేశారు.. అంజలి షాకింగ్ కామెంట్స్..!

తెలుగు హీరోయిన్ అంజలి తాజాగా తన పెళ్లి గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.నాకు ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లి చేశారు అంటూ అంజలి మాట్లాడంతో ఈమె మాటలు విన్న

Anjali: 4 సార్లు పెళ్లి చేశారు.. అంజలి షాకింగ్ కామెంట్స్..!
X

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు హీరోయిన్ అంజలి(Anjali) తాజాగా తన పెళ్లి గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.నాకు ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లి చేశారు అంటూ అంజలి మాట్లాడంతో ఈమె మాటలు విన్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు. మరి ఇంతకీ అంజలికి నాలుగు సార్లు పెళ్లి ఎవరు చేశారు అనే సంగతి చూద్దాం.. హీరోయిన్ అంజలి తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలోనే స్టార్ గా ఎదిగింది.

ఈమె అందచందాలకు నటనకి తమిళ సినీ ప్రియుల ఎక్కువ ఆదరించడంతో తమిళ ఇండస్ట్రీ ఈమెకు పెద్దపీట వేసింది. అలా అంజలి తమిళంలో స్టార్ ఇమేజ్ చేజిక్కించుకుంది. అయితే కోలీవుడ్ (Kollywood) లో వరుస సినిమాలు చేస్తూనే టాలీవుడ్ లో కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు, స్టార్ హీరో ల సినిమాల్లో ఐటెం సాంగ్స్ వంటివి చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్ళై విడాకులు తీసుకున్న ఓ బడా నిర్మాత(Producer) ను పెళ్లి చేసుకోబోతున్నట్టు గత పది రోజుల నుండి సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ గా మారుతున్నాయి.అయితే ఈ వార్తలపై అంజలి (Anjali) క్లారిటీ ఇస్తూ.. నా పెళ్లి నాకు తెలియకుండానే అందరూ కలిసి నాలుగు సార్లు చేసేసారు.

ఇక తాజాగా ఐదోసారి కూడా నా పెళ్లి చేయడానికి రెడీ అయిపోయారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయ్యే నా పెళ్లి వార్తలు నేను కూడా చూస్తున్నాను. కొంతమంది అయితే నేను సీక్రెట్ గా వివాహం చేసుకొని వేరే ఇంట్లో ఉంటున్నట్టు కూడా రూమర్స్ క్రియేట్ చేశారు. ఇక ఎవరికి తెలియని విషయం ఏమిటంటే..ప్రస్తుతం నేను అవుట్ డోర్ షూటింగ్స్ లోనే ఎక్కువగా ఉంటున్నాను. నాపై ఇలాంటి ఫేక్ పెళ్లి వార్తలు క్రియేట్ చేయకండి.. నేను పెళ్లి మొత్తమే చేసుకోను అనడం లేదు. చేసుకుంటాను కానీ సమయం వచ్చినప్పుడు మీ అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటా.. అంటూ తన పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ అంజలి(Heroine Anjali)

Tags:
Next Story
Share it