Mrunal Thakur:ఆ నటుడితో మృణాల్ ఎఫైర్..?

మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం సౌత్ నార్త్ రెండు ఇండస్ట్రీలలో చేతినిండా సినిమాలతో యాక్టీవ్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆ నటుడితో రెస్టారెంట్లో అడ్డంగా బుక్ అయింది.

Mrunal Thakur:ఆ నటుడితో మృణాల్ ఎఫైర్..?
X

న్యూస్ లైన్ డెస్క్: మృణాల్ ఠాకూర్(mrunal takur) ప్రస్తుతం సౌత్ నార్త్ రెండు ఇండస్ట్రీలలో చేతినిండా సినిమాలతో యాక్టీవ్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆ నటుడితో రెస్టారెంట్లో అడ్డంగా బుక్ అయింది. మరి ఆ నటుడు ఎవరు..మృణాల్ ఠాకూర్ తో ఆయనకి ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సీతారామం(sitharamam) సినిమాతో ఇండియా వైడ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించింది నటి మృణాల్ ఠాకూర్. ఇక గతంలో ఈ హీరోయిన్ బాలీవుడ్ లో కొన్ని సీరియల్స్ లో నటించింది.కాని సీతారామం సినిమా ఈ హీరోయిన్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో(siddanth chaturwedi) కలిసి ఓ రెస్టారెంట్లో కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అయితే ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఈ జంట డేటింగ్ చేస్తున్నారా..వీరి మధ్య ఏదైనా సంథింగ్ సంథింగ్ నడుస్తోందా ఏంటి అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే సిద్ధాంత్ చతుర్వేది బాలీవుడ్ లో యంగ్ హీరోగా కొనసాగుతున్నారు. అలాగే ఈ హీరోకి ఇప్పటికే అమితాబ్ బచ్చన్ మనవరాలైన నవ్య నవేలి నందాతో రిలేషన్ ఉంది.


ఈ జంట డేటింగ్ లో ఉన్నారు.అయితే తాజాగా మృణాల్,సిద్ధాంత్ చతుర్వేదిలు కలిసి కనిపించడంతో మృణాల్ సిద్ధాంత్ లు డేటింగ్ చేస్తున్నారంటూ ఒక రూమర్ వినిపిస్తోంది. కానీ మరి కొంత మందేమో ఈ జంట ఏదైనా సినిమా ప్రాజెక్టు కోసం కలిశారు కావచ్చు అని మాట్లాడుకుంటున్నారు.ఇక ముంబైలోని ఓ రెస్టారెంట్లో కలిసిన ఈ జంట బయటికి వచ్చాక వెళ్లిపోయే సమయంలో హగ్ చేసుకున్నారు.అంతేకాకుండా మృణాల్ మెట్లు దిగే సమయంలో ఆమె చేయి పట్టుకొని సిద్ధాంత్ నడిపించడంతో వీరిమధ్య డేటింగ్ వార్తలు జోరందుకున్నాయి. మరి వీరిద్దరూ నిజంగానే డేటింగ్ లో ఉన్నారా లేక ఏదైనా సినిమా కోసం కలిసారా అనేది తెలియాల్సి ఉంది

Tags:
Next Story
Share it