Rajamouli:నా ప్రధాన శత్రువే మురళీమోహన్.జక్కన్న కామెంట్స్ వైరల్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోలలో ఎంతో ఫేమస్ అయినటువంటి హీరో మురళీమోహన్.(murali mohan)ఆయన ఇప్పటికే ఎన్నో చిత్రాలు నటించడమే కాకుండా క్యారెట్ ఆర్టిస్టుగా

Rajamouli:నా ప్రధాన శత్రువే మురళీమోహన్.జక్కన్న కామెంట్స్ వైరల్..!
X

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోలలో ఎంతో ఫేమస్ అయినటువంటి హీరో మురళీమోహన్.(murali mohan)ఆయన ఇప్పటికే ఎన్నో చిత్రాలు నటించడమే కాకుండా క్యారెట్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు పొందారు. అలాంటి మురళీమోహన్ 90s లో అమ్మాయిల కలలో రాకుమారుడిగా మంచి గుర్తింపు సాధించాడు. ఇప్పటికీ ఆయన సినిమా టీవీలో వస్తుందంటే తప్పనిసరిగా టీవీలకు అతుక్కుపోతారు. ఈ విధంగా ఎంతో క్రేజ్ సంపాదించినా ఆయన మూవీస్ చాలా హిట్ అందుకున్నాయి. మురళీమోహన్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాదులోని శిల్పకళా వేదికలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఫేమస్ డైరెక్టర్ రాజమౌళి(rajamouli) కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తనకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. నేను చిన్నతనంలో సీనియర్ ఎన్టీఆర్(ntr) పెద్ద అభిమాని అని చెప్పారు. ఎన్ని పనులు ఉన్నా ఆయన సినిమా వచ్చింది అంటే తప్పనిసరిగా ఆ చిత్రం ఫస్ట్ షో చూడాల్సిందే అన్నారు. కానీ మా అమ్మమ్మ పెద్దమ్మ ఇతర కుటుంబ సభ్యులంతా మురళీమోహన్ అభిమానులని, నేను ఎన్టీఆర్ సినిమాకు వెళ్దాం అనుకుంటే వారంతా నన్ను బలవంతంగా మురళీమోహన్ సినిమాకు తీసుకెళ్లే వారిని,

నేను ఎన్టీఆర్ సినిమా ఒక్కసారి చూస్తే మురళీమోహన్ సినిమాలు మూడుసార్లు చూపించేవారని అందుకే నాకు అప్పటినుంచి మురళీమోహన్ అంటే శత్రువు అని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ మురళీమోహన్ అంటే కోపం కాదని నాకు నచ్చకుండా అతని సినిమాలకు తీసుకెళ్లే వారంటే చాలా కోపమని, అలా చిన్నతనంలోనే అనుకునేవాడినని కానీ కొన్నాళ్ల తర్వాత మురళీమోహన్ అంటే ఏంటో ఆయన టాలెంట్ ఏంటో అర్థం అయిందని చెప్పుకొచ్చారు. రాజమౌళి(rajamouli) కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:
Next Story
Share it