Nabha Natesh: యువరాణిగా నభా నటాషా..స్వయంభులో నభా లుక్ !

కార్తీకేయ 2" తో పాన్ హిట్టు కొట్టిన హీరో నిఖిత్ సిధ్ధార్ధ్ నటిస్తున్న పీరియాడిక్ సినిమా " స్వయంభు" అందులో నభా నటేషా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు

Nabha Natesh:  యువరాణిగా నభా నటాషా..స్వయంభులో నభా లుక్ !
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: " కార్తీకేయ 2"( KARTHIKEYA 2) తో పాన్ ( PAN INDIA) హిట్టు కొట్టిన హీరో నిఖిత్ సిధ్ధార్ధ్ నటిస్తున్న పీరియాడిక్ సినిమా " స్వయంభు" అందులో నభా నటేషా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు స్వయంభు ( SWAYAMBU) టీం. అందులో పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'స్వయంభు' ఒకటి. అందులో సంయుక్తా మీనన్( SAMYUKTHA) ఓ హీరోయిన్. నభా నటేష్ మరో కథానాయికగా నటిస్తున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని మూవీ టీం అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

ముక్కు పుడక, చెవి దిద్దులు, పాపిడి బిళ్ల చూస్తుంటే పీరియాడిక్ లుక్ నభాకు పర్ఫెక్ట్ సెట్ అయ్యాయని చెప్పవచ్చు. యువరాణిగా నభా అద్దిరిపోయింది. గ్లామర్ క్వీన్ లుక్ భలే సెట్ అయ్యింది. యాక్సిడెంట్ కారణంగా గాయం కావడంతో కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నభా నటేష్( NATA NABHASHA) కొంత విరామం తర్వాత ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

హీరోగా నిఖిల్ 20వ సినిమా 'స్వయంభు'. చిత్రం ..ఆల్రెడీ విడుదలైన ఆయన ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోందీ 'స్వయంభు'. అయితే నిఖిల్( NIKHIL) మరో రెండు సినిమాలు చేస్తున్నారు. 'స్వయంభు' చిత్రానికి 'కెజియఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ సంగీత దర్శకుడు. స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు చేసిన మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియాలో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు .

Tags:
Next Story
Share it