Naga Chaithanya: మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య..!!

అక్కినేని నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఈ మధ్యకాలంలో రూమర్స్ ఎన్ని వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు సోషల్ మీడియాలో ఇన్ని

Naga Chaithanya: మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య..!!
X

న్యూస్ లైన్ డెస్క్: అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఈ మధ్యకాలంలో రూమర్స్ ఎన్ని వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు సోషల్ మీడియాలో ఇన్ని రూమర్స్ చక్కర్లు కొట్టిన కూడా ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వడం లేదు. దాంతో నిజంగానే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారని చాలామంది భావిస్తున్నారు. మరి ఇంతకీ నాగచైతన్య ఎవర్ని రెండో పెళ్లి చేసుకోబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..

అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి వార్తలు ఎంత నిజమో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో బాగానే వైరల్ అవుతున్నాయి. అంతేకాదు నాగచైతన్య తన దూరపు చుట్టాల అమ్మాయిని కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు మాటా మంతి చేసుకున్నారని,త్వరలోనే ముహూర్తాలు పెట్టుకొని సింపుల్ గా ఇంట్లోనే ఎంగేజ్మెంట్ కానిచ్చేసి పెళ్లిని కూడా సింపుల్ గా చేసుకోవాలని నాగచైతన్య భావిస్తున్నారట. ఇక ఇప్పటికే మొదటి పెళ్లి ఎంతో గ్రాండ్ గా చేసుకున్న నాగచైతన్య రెండో పెళ్లి (Naga Chaitanya Second marraige) మాత్రం చాలా సింపుల్ గా చేసుకుంటాను అని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పారట.దాంతో ఇంట్లో వాళ్ళు కూడా ఓకే చేశారట..

అయితే నాగచైతన్య ప్రస్తుతం తండేల్(Tandel movie) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ నుండి ఫ్రీ అయిన వెంటనే నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్. అయితే చాలామంది సెలబ్రిటీలు వారి పర్సనల్ విషయాలు ఏవైనా నెట్టింట్లో చక్కర్లు కొడితే వాటిపై క్లారిటీ ఇస్తూ ఉంటారు.ఒకవేళ క్లారిటీ ఇవ్వకపోతే అది నిజమే అని అందరూ భావిస్తారు. ఇప్పుడు నాగచైతన్య విషయంలో కూడా రెండో పెళ్లి వార్తలు నిజమే అని అందరూ భావిస్తున్నారు

Tags:
Next Story
Share it