Namitha: హీరో విజయ్‌ దళపతిపై హాట్ హీరోయిన్ పోటీ !

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నమిత (Namitha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో జెమినీ లాంటి సినిమాలో మెరిసి టాప్ మోస్ట్ హీరోయిన్గా రాణించింది.

Namitha: హీరో విజయ్‌ దళపతిపై హాట్  హీరోయిన్ పోటీ !
X

Namitha: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నమిత (Namitha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో జెమినీ లాంటి సినిమాలో మెరిసి టాప్ మోస్ట్ హీరోయిన్గా రాణించింది. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత... తెలుగులో సినిమాలు చేయడం మానేసింది నమిత (Namitha). 2002 సంవత్సరంలో వచ్చిన సొంతం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

అయితే 2017 సంవత్సరంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని తిరుపతిలో వివాహం చేసుకొని నమిత. అప్పటినుంచి సినిమాలు తక్కువగానే చేస్తోంది. ఇక ఇటీవల నమిత కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం బిజెపి పార్టీలో ఉన్న హీరోయిన్ నమిత (Namitha) కీలక ప్రకటన చేసింది.

వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో హీరో విజయ్ దళపతి పై (Actor Vijay ) పోటీ చేయబోతున్నానని తెలిపింది. అవకాశం ఇస్తే ఖచ్చితంగా అతనిపై పోటీ చేస్తానని వెల్లడించింది. రాజకీయాలలో తెలివైన ప్రత్యర్థి పై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుందని వివరించారు నమిత. అందుకే విజయ్ పై (Actor Vijay ) పోటీ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. విజయ్ మీద నమిత పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని అటు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:
Next Story
Share it