Niharika Konidela: సాయి ధరమ్ తేజ్ అసలు పేరు రివీల్ చేసేసిన నిహారిక

తేజ్ బావ ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడని.. తనకు చాలా సంతోషంగా ఉందని నిహారిక కొణిదెల స్పష్టం చేసిం

Niharika Konidela: సాయి ధరమ్ తేజ్ అసలు పేరు రివీల్ చేసేసిన నిహారిక
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన మేనత్త కొడుకులు అయిన సాయి ధరమ్ తేజ్(SAIDARAM TEJ), వైష్ణవ్ తేజ్(VAISHNAV TEJ) ల గురించి చాలా ఆసక్తికర కామెంట్లు చేసింది. అసలు సాయి బావ పేరు ఎందుకు మార్చుకున్నాడో మెగా ఫ్యామిలీకి మాత్రమే తెలుసని చెప్పింది. హీరోగా అనేక సినిమాలు చేసిన సాయి ధరమ్ తేజ్.. ఇటీవలే తన స్నేహితురాలు కలర్స్ స్వాతితో కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి స్ఫెషల్ ప్రీమియర్ వేశారు.

ఈ ప్రీమియర్ షో మీటింగ్ లోనే మీడియా ముందు తన పేరు మార్చుకుంటున్నట్లు తెలిపారు సాయిధరమ్ తేజ్. ముఖ్యంగా తన పేరును సాయి ధరమ్ తేజ్(SAIDHARAM TEJ) నుంచి సాయి దుర్గ తేజ్(SAI DURGA TEJ) గా మార్చుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈయన పేరు మార్చుకోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఓసారి ఆయన పేరు మార్చుకున్నారు.

సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లతో తనకు చాలా మంచి బాండింగ్ ఉంది. నిహారిక వీరితో చాలా క్లోజ్ ఉంటుంది. వీరిద్దరికీ వాళ్ల అమ్మ అంటే చాలా ఇష్టం .అయితే తల్లి మీద విపరీతమైన ప్రేమ కల్గిన సాయి ధరమ్ తేజ్ తన అత్త కోసమే పేరు మార్చుకున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేనా తన మేనత్త చాలా అందంగా ఉంటుందని ...పెద్ద బొట్టు , చేతినిండా గాజులు , ముక్కుపుడక భలే అందంగా ఉంటారని నిహారిక తెలిపింది. ఆవిడని చూడగానే చాలా మర్యాద పూర్వకంగా అనిపిస్తుందని తెలిపారు. అయితే రీసెంట్ గా తేజ్ బావ ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడని.. తనకు చాలా సంతోషంగా ఉందని నిహారిక కొణిదెల స్పష్టం చేసింది.

Tags:
Next Story
Share it