Niharika: ఇంటి నుండి వెళ్లిపోయిన నిహారిక..కారణం..?

మెగా డాటర్ నిహారిక నిజంగానే మెగా ఫ్యామిలీకి దూరంగా వెళ్లిపోయిందా... రెండో పెళ్లి చేసుకోక పోయినప్పటికీ నిహారిక(niharika) ఎందుకు ఫ్యామిలీ కి దూరంగా ఉండాలని

Niharika: ఇంటి నుండి వెళ్లిపోయిన నిహారిక..కారణం..?
X

న్యూస్ లైన్ డెస్క్: మెగా డాటర్ నిహారిక నిజంగానే మెగా ఫ్యామిలీకి దూరంగా వెళ్లిపోయిందా... రెండో పెళ్లి చేసుకోక పోయినప్పటికీ నిహారిక(niharika) ఎందుకు ఫ్యామిలీ కి దూరంగా ఉండాలని అనుకుంటుంది.. నిజంగానే నిహారిక ఇంటి నుండి వెళ్లిపోయిందా అనే షాకింగ్ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. నిహారిక రీసెంట్ గా తన ఫ్రెండ్ అయినా యూట్యూబర్ నిఖిల్ సింహాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన విడాకులకు సంబంధించి ఎన్నో షాకింగ్ కామెంట్స్ చేసింది.

అంతే కాదు ఇప్పటివరకు ఎక్కడా కూడా ఓపెన్ అవ్వని విషయాలను తన ఫ్రెండ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది నిహారిక. అలాగే నిహారిక ఆ ఇంటర్వ్యూలో తాను తన ఫ్యామిలీకి దూరంగా ఉండాలి అనే ఒక సంచలన నిర్ణయాన్ని కూడా తీసుకుందని బయటపెట్టింది. నేను ఒంటరిగా ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటాను. అందుకే ఇంటికి దూరంగా నాకంటూ ఒక ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ఇల్లు నిర్మించుకుంటున్నాను. అయితే ఇల్లు కట్టుకోవడానికి కావలసిన డబ్బులు నా దగ్గర లేవు..అందుకే మా నాన్న దగ్గర కొన్ని డబ్బులు తీసుకున్నాను. ఆ తర్వాత మళ్లీ ఇచ్చేస్తాను.. అయితే ఇల్లును మెయింటైన్ చేయడం కూడా అంత సులభమైన పని ఏం కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది.

ఇక ఈ విషయంలో ఇంటిని ఎలా మెయింటైన్ చేయాలో మా అమ్మ నుండే అన్ని విషయాలు నేర్చుకున్నాను. మా అమ్మ ఇంటిని చాలా సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తూ వస్తుంది. అలాగే అడిగినప్పుడు డబ్బులు ఇస్తారు కానీ ఆ డబ్బులు ఏ వర్క్ కోసం తీసుకుంటున్నావు అనేది మాత్రం కచ్చితంగా అడుగుతారు..అంటూ నిహారిక ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇక నిహారిక మాటలను చూస్తే రెండో పెళ్లి కాకుండానే నిహారిక తన ఫ్యామిలీకి దూరంగా..ఒంటరిగా.. ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అలాగే తనని అర్థం చేసుకునేవాడు దొరికితే ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని నిహారిక చెప్పింది.

Tags:
Next Story
Share it