Parasyte The Grey: ‘నెట్‌ఫ్లిక్స్’లోకి కొత్త కొరియన్ సిరీస్ ‘పారాసైట్: ది గ్రే’

ట్ ఫ్లిక్స్ ( NETFLIX) లో మరో కొరియన్ సీరిస్ రిలీజ్ అవుతుంది. ‘పారాసైట్: ది గ్రే’. ( THE GRAY) ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్నో ప్రముఖ కొరియన్ సిరీస్‌లు సూపర్ హిట్ అందుకోగా.. ‘పారాసైట్: ది గ్రే’పై ముందు నుండే అంచనాలు భారీగా ఉన్నాయి.

Parasyte The Grey: ‘నెట్‌ఫ్లిక్స్’లోకి కొత్త కొరియన్ సిరీస్ ‘పారాసైట్: ది గ్రే’
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొరియన్ సీరీస్( KOREAN SERIES) అంటే చాలు ఆడపిల్లలు అసలు నిద్రపోకుండా మరీ చూసేస్తున్నారు. ఈ మధ్యఅంతా బీటీఎస్ హవానే కదా..అయితే ఈ కొరియన్ సీరీస్ లంటే పడిచచ్చే వారికి గుడ్ న్యూస్ . నెట్ ఫ్లిక్స్ ( NETFLIX) లో మరో కొరియన్ సీరిస్ రిలీజ్ అవుతుంది. ‘పారాసైట్: ది గ్రే’. ( THE GRAY) ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్నో ప్రముఖ కొరియన్ సిరీస్‌లు సూపర్ హిట్ అందుకోగా.. ‘పారాసైట్: ది గ్రే’పై ముందు నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్ 5న స్ట్రీమింగ్ ప్రారంభించుకోనున్న ఈ సిరీస్ హార్రర్ కంటెంట్ ఇష్టపడేవారికి తెగ నచ్చేస్తుందంటున్నారు. ఇది మీకెలా తెలుసుఅంటారేమో...నిజానికి ఈ సీరిస్ ఓ బుక్ ఆధారంగా తీసారు. కాబట్టి స్టోరీ ముందే తెలుస్తుంది కదా..బుక్ చదివిన వాళ్లంతా సూపర్ ఉంటుందంటున్నారు.

హితోషి ఇవాకీ అనే రైటర్.. జపాన్‌లో ఫేమస్ కార్టున్ అయిన పారాసైట్‌ను క్రియేట్ చేశారు. ఆ యానిమీ పుస్తకం ఇప్పటివరకు 25 మిలియన్ల కాపీలను అమ్ముడుపోయేలా చేసింది. ‘పారాసైట్: ది గ్రే’ సిరీస్ కూడా ఇదే పుస్తకంపై ఆధారపడి తెరకెక్కింది. పుస్తకంలో ఉన్న కథను ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించకపోయినా.. స్టోరీ లైన్‌లో పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సిరీస్‌లో సున్-ఇన్ అనే పాత్రలో జియోన్ సో-నీ నటించింది.

‘పారాసైట్: ది గ్రే’ ట్రైలర్ చూస్తుంటే ఇదొక మామూలు కొరియన్ డ్రామాలాగా అనిపించడం లేదంటున్నారు. మామూలుగా కొరియన్ డ్రామాలలో ఏ జోనర్ సిరీస్‌లు అయినా 16 ఎపిసోడ్లు ఉంటాయి. కానీ ‘పారాసైట్: ది గ్రే’ మాత్రం 6 ఎపిసోడ్లే. తక్కువ కంటెంట్ లో ఇంట్రస్టింగ్ సీన్స్ తో తీసారట.

వింత వింత ఆకారాల్లో ఉన్న జీవులు.. ప్రేక్షకులను భయపెట్టేలా ఉన్నాయి. ‘పారాసైట్: ది గ్రే’ ట్రైలర్ ప్రకారం ఒక పారాసైట్ మనుషుల చెవుల్లోకి వెళ్లడం వల్ల వారు వింత జీవులుగా మారుతారని ఆ బుక్ లో రాసారు రైటర్. ఇప్పటికే ‘పారాసైట్: ది గ్రే’ టీజర్‌కు 3 మిలియన్ల వ్యూస్ రాగా.. ట్రైలర్ విడుదలయిన 48 గంటల్లోనే 10 వేల వ్యూస్ వచ్చాయి. వ్యూస్ చూస్తే ఏప్రిల్ 5 కోసం కొరియన్ సీరిస్ లవర్స్ తెగ వెయిట్ చేస్తున్నారని అర్ధమవుతుంది.

Tags:
Next Story
Share it