Pawankalyan:హీరో కాకముందు టీ అందించారా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో పవన్ కళ్యాణ్(pawankalyan )అంటే తెలియని వారు ఉండరు. ఆయన సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ

Pawankalyan:హీరో కాకముందు టీ అందించారా.?
X

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో పవన్ కళ్యాణ్(pawankalyan )అంటే తెలియని వారు ఉండరు. ఆయన సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా మారాడు. కానీ పవన్ కళ్యాణ్ అంతటి స్థాయికి రావడానికి ఆయన చేసే పనిపై ఉన్నటువంటి నమ్మకం పట్టుదల. ఆయన ఏదైనా కావాలనుకుంటే తప్పనిసరిగా నెరవేరే వరకు ఎంతో కష్టపడతాడట. పట్టువదలని విక్రమార్కుడిలా ఉంటూ అనుకున్నది సాధిస్తారట.

ఆయన పట్టుదల సాధన గురించి మొన్నటి ఎలక్షన్స్ లోనే తెలిసింది. టిడిపిని తన భుజాస్కందాలపై వేసుకొని ఏకకాలంలో ఇటు టిడిపి మరోవైపు జనసేన పార్టీని ఏపీలో గెలిపించుకోగలిగారు. అంతే కాదు దేశంలోనే ఏ పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాలు ఇప్పటివరకు గెలవలేదు. కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీగా అవతరించింది. ఇంతటి స్థాయికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ఏనాడు కూడా విర్రవిగాడట. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం. అయితే ఆయన హీరో కాకముందు చాలా కష్టపడ్డారట. టీ కూడా అందించారట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చే ముందు కరాటే నేర్చుకున్నారు. చెన్నై బేస్డ్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు షహానీ హుస్సేన్ దగ్గర పవన్ కళ్యాణ్ కరాటే నేర్చుకున్నారట.

హుస్సేన్ మంచి కరాటే మాస్టర్. ఆయన 1990లో కరాటే నేర్పించడం మానేసి సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతూ ఉన్నాడట. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ వెళ్లి తన కరాటే నేర్పమని అడిగారట. హుస్సేన్ నేను ఇప్పుడు కరాటే నేర్పించడం లేదు వర్క్ చేస్తున్నానని చెప్పారట. అయినా వినిపించుకొని పవన్ కళ్యాణ్ దాదాపు నెల రోజులపాటు ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్లి బ్రతిమిలాడుకున్నాడట. చివరికి ఆయన దగ్గర ఉంటూ ఆయనకు టీ అందిస్తూ, ఒక్కోసారి హుస్సేన్ ఉండే రూములు కూడా క్లీన్ చేసి ఉంచేవాడట. అలా పవన్ కళ్యాణ్ నిబద్ధత చూసినటువంటి హుస్సేన్ తనకు కరాటే నేర్పించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడంతో హుస్సేన్ పేరు బయటకు వచ్చింది.

Tags:
Next Story
Share it