Trisha: విశ్వంభరలో త్రిష లుక్ ఇదే...!

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ ‘విశ్వంభర‘. పాన్ ఇండియా లెవల్లో సోషియో ఫాంటసీగా ఈ సినిమా వస్తోంది.

Trisha: విశ్వంభరలో త్రిష లుక్ ఇదే...!
X

న్యూస్ లైన్, ఫిల్మ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ ‘విశ్వంభర‘. పాన్ ఇండియా లెవల్లో సోషియో ఫాంటసీగా ఈ సినిమా వస్తోంది. దీనికి బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ట దర్శక్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా వస్తోంది. దీంతో అటూ ఫ్యాషన్‌లో ఫుల్ ఎగ్జైట్‌మెంట్ ఉంది. త్రిష బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి త్రిష లుక్ విడుదల చేశారు.


హ్యాపీ బర్త్‌ డే త్రిష అంటూ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ మూవీని యువీ క్రియేషన్స్ సంస్థ దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తుంది. చిరంజీవి సినిమాల్లో ఇదే భారీ బడ్జెట్ సినిమా. దీంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పంచ భూతాల నేపథ్యంలో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Tags:
Next Story
Share it