prakash raj : బీజేపీ లోకి నటుడు ప్రకాష్ రాజ్..?

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలను పోషించి విలక్షణ నటుడిగా గొప్ప పేరు తెచుకున్న ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన గురించి అందరికీ తెలిసిందే. కేవలం సినీ నటుడిగా మాత్రమే కాకుండా, ప్రకాష్ రాజ్ కి సమాజం పట్ల ఉన్న అవగాహన, ఆసక్తి మామూలుది కాదు.

prakash raj : బీజేపీ లోకి నటుడు ప్రకాష్ రాజ్..?
X

న్యూస్ లైన్ డెస్క్: ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలను పోషించి విలక్షణ నటుడిగా గొప్ప పేరు తెచుకున్న ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన గురించి అందరికీ తెలిసిందే. కేవలం సినీ నటుడిగా మాత్రమే కాకుండా, ప్రకాష్ రాజ్ కి సమాజం పట్ల ఉన్న అవగాహన, ఆసక్తి మామూలుది కాదు. రాజకీయ పరిస్థితులపై ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా చాలా బోల్డ్ గా కామెంట్ చేస్తూ ఉంటారు. 2019 ఎన్నికలలో ఆయన స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా బెంగళూరు సెంట్రల్ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు. సోషల్ మీడియా లో ఆయన అకౌంట్ ని ఒక్కసారి పరిశీలిస్తే ప్రకాష్ రాజ్ బీజేపీ పార్టీ వ్యతిరేకి అని అందరికీ అర్థం అవ్వుధి. కానీ గత కొద్దిరోజులుగా ఆయన బీజేపీ పార్టీ లో చేరబోతున్నట్టు సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి. బీజేపీ పై నరేంద్ర మోడీ పై ఇంతటి వ్యతిరేకత చూపించే ప్రకాష్ రాజ్, ఇప్పుడు అదే బీజేపీ లో చేరడం ఏమిటి అని నెటిజెన్స్ అనుకున్నారు. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్తలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ 'బీజేపీ వాళ్ళు చాలా బాగా ట్రై చేసారు. కానీ సిద్ధాంతాల పరంగా ఈ ప్రకాష్ రాజ్ ని కొనడం ఎవరి తరం కాదు' అంటూ ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Tags:
Next Story
Share it