PRASANTH NEEL: ప్రశాంత్ నీల్ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా?

ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ హీరోగా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ( JR NTR) అంటే మహా ఇష్టమట. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయలేదు.

PRASANTH NEEL: ప్రశాంత్ నీల్ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రాజమౌళి ( RAJMOULI) తర్వాత దక్షిణాది నుంచి ఆ రేంజ్ అప్లాజ్ దక్కించుకున్న వ్యక్తి ప్రశాంత్ నీల్( PRASANTH NEL). కేజీఎఫ్ వన్ తో ఆల్ ఓవర్ ఇండియా ప్రశాంత్ ను ఆకాశానికెత్తేశాయి. తెలుగు సినిమాను జాతీయస్థాయికి, అంతర్జాతీయస్థాయికి రాజమౌళి తీసుకువెళ్లారు. ఆయన చూపిన బాటలోనే ప్రశాంత్ నీల్ కూడా అడుగులు వేస్తున్నారు. కన్నడంలో మొదటిగా ఉగ్రమ్ సినిమాను రూపొందించారు. అది ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ప్రశాంత్ నీల్ కు మంచిపేరు వచ్చింది.

ఉగ్రమ్ తర్వాత .. కేజీఎఫ్( KGF 1) 1, 2 సినిమాలతో జాతీయస్థాయిలో నీల్ పేరు మార్మోగిపోయింది. తాజాగా సలర్ ( SALAR) తో మరోసారి తన సత్తాను చాటాడు. ఈ సినిమా కూడా రూ.650 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. సలార్ 2 శౌర్యాంగపర్వం పనుల్లో ఫుల్ బిజీ గా ఉన్నాడు ప్రభాస్ . అయితే జాతీయస్థాయిలో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నీల్ కు ఇష్టమైన హీరో ఒకరు ఉన్నారు. తనతో సినిమా చేయకపోయినా సరే తనంటే చాలా ఇష్టమంటున్నారు ప్రశాంత్ నీల్.

ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ హీరోగా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ( JR NTR) అంటే మహా ఇష్టమట. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయలేదు. అయినా తన ఫేవరేట్ హీరో మాత్రం ఎన్టీఆర్ అంటూ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు కాదు తను సినిమాల్లోకి వస్తున్నపుడే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ని అంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు.. జూనియర్ 31వ చిత్రాన్ని తీయబోతున్నాడు. దీనికి సంబంధించి ఎన్నాళ్లనుంచో దాచుకున్న తన సొంతకథను, తన డ్రీమ్ ప్రాజెక్టును తారక్ తోనే తెరకెక్కించబోతున్నారు. ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు. అది ఏప్రిల్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉన్నప్పటికీ చాలా కారణాలతో విజయదశమికి వాయిదా పడింది. రిలీజ్ కోసం వెయిట్ చెయ్యాల్సిందే.

Tags:
Next Story
Share it