PREMALU: ప్రేమలు ఓటీటీపై బిగ్ ట్విస్ట్.. తెలుగులో స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే?

ప్రతి భాషలోనూ సినిమాలు వస్తుంటాయి.పోతుంటాయి కాని ఈ లిస్ట్ ప్రేమలు సినిమా వేరు. వాటిలో కొన్ని మాత్రం తక్కువ బజ్, బడ్జెట్‌తో వచ్చినా సెన్సేషనల్ హిట్లుగా నిలుస్తుంటాయి.

PREMALU: ప్రేమలు ఓటీటీపై బిగ్ ట్విస్ట్.. తెలుగులో స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రతి భాషలోనూ సినిమాలు వస్తుంటాయి.పోతుంటాయి కాని ఈ లిస్ట్ ప్రేమలు సినిమా వేరు. వాటిలో కొన్ని మాత్రం తక్కువ బజ్, బడ్జెట్‌తో వచ్చినా సెన్సేషనల్ హిట్లుగా నిలుస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో 'ప్రేమలు'( PREMALU) ఒకటి. భలే క్రేజ్ తెచ్చుకుంది. కాని ఓటీటీ రిలీజ్ మాత్రం ఫుల్ ఫామ్ లో ఉంది.

నస్లెన్ కే గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో గిరీష్ ఏడీ రూపొందించిన చిత్రమే 'ప్రేమలు'. ఈ మూవీ మలయాళంలో భారీ విజయాన్ని అందుకోవడంతో దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ ( KARTHIKEYA) దీన్ని తెలుగులో విడుదల చేశాడు. అన్ని భాషల్లోనూ భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్న 'ప్రేమలు' మూవీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీంతో దీన్ని ఓటీటీలో రిలీజ్ కు వెయిట్ చేస్తున్నారు. కాని మార్చి 29 రిలీజ్ అని అనౌన్స్ కూడా చేశారు. కాని ఓటీటీకి ఇవ్వలేదు. ఇఫ్పుడు ఏకంగా తెలుగులో అప్పుడే రిలీజ్ చేయలేమంటున్నారు మూవీ టీం.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12 నుంచి తీసుకు రాబోతుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్( HOTSTAR) సంస్థ తాజాగా 'ప్రేమలు' మూవీని ఏప్రిల్ 12వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు ప్రకటించింది. అయితే, అసలు ట్విస్ట్ అక్కడే ఇచ్చింది. ఈ చిత్రాన్ని కేవలం మలయాళం, తమిళం, హిందీ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు హాట్‌స్టార్ తెలిపింది. ప్రేమలు' మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్ (పుష్ప విలన్), దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు.

Tags:
Next Story
Share it