Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి శుభలేఖ..సోషల్ మీడియాలో వైరల్!

గత కొంతకలం నుండి ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ అనే బాలీవుడ్ నిర్మాతతో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరు ఒకే ఇంట్లో డేటింగ్ చేస్తున్న ఈ ప్రేమజంట, ఈనెల 21 వ తారీఖున వివాహబంధం తో ఒక్కటి కాబోతుంది.

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి శుభలేఖ..సోషల్ మీడియాలో వైరల్!
X

న్యూస్ లైన్ , హైదరాబాద్ : గత కొంతకలం నుండి ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ అనే బాలీవుడ్ నిర్మాతతో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరు ఒకే ఇంట్లో డేటింగ్ చేస్తున్న ఈ ప్రేమజంట, ఈనెల 21 వ తారీఖున వివాహబంధం తో ఒక్కటి కాబోతుంది. అయితే ఈ ప్రేమజంటపై సంభందించిన వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ శుభలేఖలో మండపం చుట్టూ కొబ్బరి చెట్లను, సముద్రం బ్యాక్ డ్రాప్ లో ముద్రించారు. కార్డుపై 'అభ్ దోనో భగ్నానీ' అనే అక్షరాలు కూడా ప్రింట్ చేయించారు. వీళ్లిద్దరి వివాహం గోవాలో జరగబోతుంది. ఈమధ్య కాలం లో సెలబ్రిటీస్ మొత్తం డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట ఇతర దేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే ప్రధాని మోడీ 'కనీసం సెలెబ్రిటీలు అయినా మన ఇండియాలోనే పెళ్లి చేసుకోవచ్చు కదా, మీరు అలా పెళ్లి చేసుకోవడం ఆయా ప్రదేశాలకు ప్రాముఖ్యత కలుగుతుంది ' అని ప్రసంగం ఇచ్చాడు.

ఆయన ఇచ్చిన పిలుపుకి గౌరవం ఇస్తూ రకుల్ ప్రీత్ సింగ్ తన వివాహం ని ఇక్కడే ఇండియా లో గోవాలో చేసుకోవాలని నిశ్చయించుకుంది. ముందుగా అయితే ఈ జంట వేరే దేశం లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే, తెలుగు లో అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన ఈమెకు, ఈమధ్య కాలం లో సినిమా అవకాశాలు రావడం లేదు. కొత్త హీరోయిన్స్ రాకతో పాటుగా, ఈమె గత చిత్రాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం వల్ల ఈమెకి సినిమా అవకాశాలు తగ్గాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. అలా అవకాశాలు తగ్గడం వల్లే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటుంది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Tags:
Next Story
Share it