Rakul Preet Singh: రకుల్ పెళ్లి కార్డు ధరతో ఓ ఇల్లు కట్టేయచ్చు.. ఎన్ని లక్షలంటే..?

గత కొద్ది రోజులుగా రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నాని ల పెళ్లి అంటూ వస్తున్న వార్తలన్నింటికి తెరపడింది. ఎందుకంటే చాలా రోజుల నుండి వీరి పెళ్లి వార్తలు మీడియాలో

Rakul Preet Singh: రకుల్ పెళ్లి కార్డు ధరతో ఓ ఇల్లు కట్టేయచ్చు.. ఎన్ని లక్షలంటే..?
X

న్యూస్ లైన్ డెస్క్: గత కొద్ది రోజులుగా రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) , జాకీ భగ్నాని(Jackky bhagnani) ల పెళ్లి అంటూ వస్తున్న వార్తలన్నింటికి తెరపడింది. ఎందుకంటే చాలా రోజుల నుండి వీరి పెళ్లి వార్తలు మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. కానీ ఒక్కసారి కూడా ఈ జంట తమ పెళ్ళి నిజమే అన్నట్లు క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డుని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం వల్ల వీరి పెళ్లి నిజమే అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది

.ఇక వీరి పెళ్లి గోవాలో ఫిబ్రవరి 21న జరగబోతుంది. ఇక ఫిబ్రవరి 19నే రకుల్,జాకీల కుటుంబ సభ్యులు గోవాకి చేరుకుంటారు. ఇక వీరి పెళ్లికి ముందే హాల్ది, మెహందీ,కాక్టైల్,సంగీత్ వంటి పార్టీలన్నీ చేసుకుంటారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి వెడ్డింగ్ కార్డుని అందరూ చూసే ఉంటారు. ఇక ఈ వెడ్డింగ్ కార్డులో స్పెషాలిటీ ఏంటంటే.. రకుల్ ప్రీత్ సింగ్ గోవా(Goa) లో పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి గోవా అందాలను తన పెళ్లి కార్డులో స్పెషల్ గా ముద్ర వేయించుకుంది.

అయితే ఈ పెళ్లి కార్డులో గోవా అందాలైన బీచ్, కొబ్బరి చెట్లు వంటివి ఉన్నాయి.అయితే రకుల్, జాకీ (Jackky) లు తమ పెళ్లి కార్డు కోసం ఎన్ని లక్షలు పెట్టారో తెలిస్తే మీరందరూ షాక్ అవ్వాల్సిందే.ఎందుకంటే ఒక పెళ్లి కార్డు తయారు చేయడానికి దాదాపు ఆరు లక్షల ఖర్చు చేశారట.. అయితే సెలబ్రిటీలకు ఇది మామూలు విషయమే కానీ ఈ వార్త తెలిసిన మామూలు జనాలు మాత్రం ఆరు లక్షలతో ఓ ఇల్లే కట్టేయొచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags:
Next Story
Share it