Spirit : ప్రభాస్ కొత్త సినిమాలో రష్మిక..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ని తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా 'ఎనిమల్' సినిమా ద్వారా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన సత్తా చాటిన సంగతి అందరికీ తెలిసిందే.

Spirit : ప్రభాస్ కొత్త సినిమాలో రష్మిక..!
X
న్యూస్ లైన్ డెస్క్ : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ని తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా 'ఎనిమల్' సినిమా ద్వారా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన సత్తా చాటిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో రణబీర్ కపూర్ పెర్ఫార్మన్స్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో , రష్మిక పెర్ఫార్మన్స్ కి కూడా అంతే మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సందీప్ వంగ తన తదుపరి చిత్రం లో కూడా రష్మిక నే తీసుకున్నాడు. 'ఎనిమల్' చిత్రం తర్వాత ఆయన ప్రభాస్ తో 'స్పిరిట్' అనే సినిమా చెయ్యబోతున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ప్రభాస్ ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తి అవ్వగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందులో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని చెయ్యబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి.
Tags:
Next Story
Share it