Sai Pallavi: ఆ బాలీవుడ్ హీరో కొడుకుతో రొమా** చేస్తున్న సాయి పల్లవి..!!

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఆ స్టార్ హీరో కొడుకుతో రొమా** చేస్తుందా..ఇది నిజమేనా అంటే.. నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. ఎందుకంటే సాయి పల్లవి బాలీవుడ్

Sai Pallavi: ఆ బాలీవుడ్ హీరో కొడుకుతో రొమా** చేస్తున్న సాయి పల్లవి..!!
X

న్యూస్ లైన్ డెస్క్: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) ఆ స్టార్ హీరో కొడుకుతో రొమా** చేస్తుందా..ఇది నిజమేనా అంటే.. నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. ఎందుకంటే సాయి పల్లవి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు తో మూవీలో నటిస్తోందట. షారుక్ ఖాన్ (Sharukh khan) కొడుకు జునైద్ ఖాన్ తో సాయి పల్లవి జతకట్టబోతుందట. ఈ మూవీ తోనే సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నట్టు టాక్.


అయితే ఈ సినిమా లవ్ స్టోరీ నేపథ్యంలో రాబోతుందని తెలుస్తోంది.ఇందులో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా ఉంటుందట. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ జపాన్ కి వెళ్ళినట్టు సమాచారం. ఎందుకంటే జపాన్ (Japan) లో పాపులర్ ఫెస్టివల్ అయినా సపరో స్నో వేడుకల్లో మూవీ యూనిట్ సందడి చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా షూటింగ్ సెట్ నుండి సాయి పల్లవి జునైద్ ఖాన్(Junaid khan) కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి.

దాంతో వీరిద్దరి కాంబినేషన్లో నిజంగానే సినిమా రాబోతుందని ఆ స్టార్ హీరో కొడుకు సినిమాతోనే సాయి పల్లవి బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ మూవీ లో మాత్రమే కాకుండా నాగ చైతన్య(Nagachaithanya) హీరోగా వస్తున్న తండేల్ మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ మూవీలో ఓ పల్లెటూరి అమ్మాయిలాగా సాయి పల్లవి కనిపించబోతుంది.

Tags:
Next Story
Share it