రౌడీ హీరోకు జోడిగా సాయి పల్లవి..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda)అంటే తెలియని వారు ఉండరు. ఆయన తీసింది తక్కువ సినిమాలే అయినా కానీ మంచి గుర్తింపు పొందారు.

రౌడీ హీరోకు జోడిగా సాయి పల్లవి..!
X

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda)అంటే తెలియని వారు ఉండరు. ఆయన తీసింది తక్కువ సినిమాలే అయినా కానీ మంచి గుర్తింపు పొందారు. అలాంటి ఈయన గీత గోవిందం, అర్జున్ రెడ్డి వంటి చిత్రలో నటించి రౌడీ హీరోగా మారారు. అలాంటి ఈయన తాజాగా నటించినటువంటి లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు కాస్త ఫ్లాప్ అయ్యాయి.

అయినా ఈ హీరోకు అవకాశాలు తగ్గడం లేదు. తాజాగా దేవరకొండ హీరోగా ఎస్ విసి 59 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక చిత్రం తెరకెక్కనుంది. ఇందులో సాయి పల్లవి(saipallavi) హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. రవి కిరణ్ కోలా(ravikiran kola)ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా , దిల్ రాజ్ (dil raju)నిర్మాణ సారధ్యంలో తెరకెక్కనుంది.

గ్రామీణ కథ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా గురించి ఆయన బర్త్డే సందర్భంగా స్పెషల్ గా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందులో లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుండట. కథ చాలా డిఫరెంట్ గా, కొత్తదనంతో ఉండడంతో ఆమె ఓకే చెప్పిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రావలసి ఉంది.

Tags:
Next Story
Share it