Sameera: అవి పెరగడానికి సర్జరీ చేయించుకోమన్నారు..!

: బాలీవుడ్ నటి సమీరా రెడ్డి తెలుగులో కూడా జై చిరంజీవ,అశోక్, నరసింహుడు వంటి సినిమాలు చేసింది. అయితే ఈ హీరోయిన్ కి తెలుగులో కంటే బాలీవుడ్ లోనే అభిమానులు బ్రహ్మరథం

Sameera: అవి పెరగడానికి సర్జరీ చేయించుకోమన్నారు..!
X

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ నటి సమీరా రెడ్డి (Sameera reddy) తెలుగులో కూడా జై చిరంజీవ, అశోక్, నరసింహుడు వంటి సినిమాలు చేసింది. అయితే ఈ హీరోయిన్ కి తెలుగులో కంటే బాలీవుడ్ లోనే అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకొని పిల్లలకు జన్మనిచ్చి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది.ఇక కొంత మంది హీరోయిన్లు తమ న్యాచురల్ ఫేస్ ని మేకప్ లేని ఫేసులను చూపించుకోవడానికి అస్సలు ముందుకు రారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం తన మేకప్ లేని ఫోటోలను ఎన్నో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అంతేకాకుండా తన రియల్ ఏజ్ ని కూడా బయట చెప్పుకోవడానికి అస్సలు మొహమాట పడదు.

ఇక ఈ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూం.. నేను సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో మంచి సినిమాలు చేశాను. కానీ కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో కొంతమంది నన్ను బ్రెస్ట్ సర్జరీ చేయించుకోమని సలహాలు,సూచనలు ఇచ్చారు. బ్రెస్ట్ ఎన్ లార్జ్ మెంట్ సర్జరీ చేయించుకుంటే మరిన్ని అవకాశాలు వస్తాయి అని చెప్పారు.అయితే వారు ఎంత బలవంతం చేసినా కూడా నేను దానికి ఒప్పుకోలేదు. ఇక హీరోయిన్లందరూ చేయించుకోవడం లేదా నీకేం ఇబ్బంది అని పదేపదే వాళ్ళు అడిగి విసిగించినా కూడా నేను అస్సలు ఆ పని చేయలేదు అంటూ సమీరా రెడ్డి(Sameera Reddy) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది

Tags:
Next Story
Share it