Sandeep Kishan: ముగ్గురు హీరోయిన్స్ తో సందీప్ కిషన్ లవ్..!!

ఊరు పేరు భైరవకోన"(uru peru byravakona) అనే మూవీతో ఫిబ్రవరి 16న మన ముందుకు రాబోతున్నాడు నటుడు సందీప్ కిషన్. ఈ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటారని

Sandeep Kishan: ముగ్గురు హీరోయిన్స్ తో సందీప్ కిషన్ లవ్..!!
X

న్యూస్ లైన్ డెస్క్: "ఊరు పేరు భైరవకోన"(uru peru byravakona) అనే మూవీతో ఫిబ్రవరి 16న మన ముందుకు రాబోతున్నాడు నటుడు సందీప్ కిషన్. ఈ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటారని ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్,టీజర్ చూసిన చాలా మంది నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు మరికొద్ది రోజులే ఉన్న కారణంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మూవీ మేకర్స్.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ తాను ఇండస్ట్రీకి చెందిన ఓ ముగ్గురు హీరోయిన్లతో ప్రేమలో పడి మోసపోయాను అంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.

సందీప్ కిషన్(sandeepkishan) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లనే ముగ్గురిని ప్రేమించాను..కానీ ఆ విషయాన్ని మాత్రం ఇప్పటికీ సీక్రెట్ గా ఉంచాను. చాలామంది నేను రెజీనాను ప్రేమించాను అనుకుంటారు.కానీ రెజీనాకు నాకు మధ్య ఎలాంటి ప్రేమ బంధం లేదు. మేమిద్దరం చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. చదువుకునే రోజుల్లో నుండే మేము ఫ్రెండ్స్. ఇక నా బ్రేకప్ లు ఒడిదుడుకులు అన్ని రెజీనాకు(rejeena) తెలుసు. ఒక హీరోయిన్ తో నాలుగు సంవత్సరాలు,మరో హీరోయిన్ తో రెండున్నర సంవత్సరాలు,ఇంకో హీరోయిన్ తో రెండు సంవత్సరాలు ప్రేమలో ఉన్నాను. ఇక నేను ప్రేమించిన ప్రతి అమ్మాయితో చాలా డీప్ గానే వెళ్లిపోయాను. అంతేకాదు చాలా నిజాయితీగా కూడా ప్రేమించాను. కానీ ఎందుకో ముగ్గురు హీరోయిన్స్ లో ఏ ఒక్కరి ప్రేమకు కూడా నేను నోచుకోలేదు.

అయితే నేను ఇండస్ట్రీలో ఎదిగే క్రమంలో ఇప్పుడున్న పొజిషన్లో నా లవ్ ఫెయిల్యూర్స్ అనేది నా జీవితంలో అంత ముఖ్యం కాదు అనిపించింది..అంటూ ఓ షాకింగ్ విషయాన్నీ బయట పెట్టారు. కానీ ఆయన ప్రేమించిన హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లికి తొందర పెట్టకపోవడం వల్ల ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అంటూ సందీప్ కిషన్ చెప్పారు. ఇక గత ఏడాది మైఖేల్(mykhale) సినిమా ఆకట్టుకోకపోయినప్పటికీ ఊరు పేరు భైరవకోన సినిమా సందీప్ కిషన్ కి హిట్ ఇస్తుందని చాలామంది భావిస్తున్నారు.

Tags:
Next Story
Share it