Sharukh Khan: ఫస్ట్ వాలెంటైన్స్ డే కి తన భార్యకి షారుక్ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?

బాలీవుడ్ కింగ్ ఖాన్ గా(Sharukh Khan) పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ ఎన్నో లవ్ రొమాంటిక్ అలాగే యాక్షన్ సినిమాల్లో నటించారు. ఇక గత ఏడాది ఈయన నటించిన జవాన్, పఠాన్

Sharukh Khan: ఫస్ట్ వాలెంటైన్స్ డే కి తన భార్యకి షారుక్ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?
X

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ కింగ్ ఖాన్ గా(Sharukh Khan) పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ ఎన్నో లవ్ రొమాంటిక్ అలాగే యాక్షన్ సినిమాల్లో నటించారు. ఇక గత ఏడాది ఈయన నటించిన జవాన్, పఠాన్ సినిమాలు బాలీవుడ్ పరువు పోకుండా కాపాడాయని చెప్పుకోవచ్చు.వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈయన జవాన్ మూవీతో సౌత్ ఇండస్ట్రీ లో కూడా ఓ వెలుగు వెలిగారు.

అయితే అలాంటి ఈయన తన భార్య గౌరి ఖాన్ ని(gourai khan) ప్రేమించి 1991లో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం వాలెంటైన్స్ డే వీక్ నడుస్తోంది.ఈ నేపథ్యంలోనే గత ఏడాది షారుక్ ఖాన్ తన అభిమానులతో తన మొదటి వ్యాలెంటెన్ డే కి తన భార్య అయిన గౌరీ ఖాన్ కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో రివిల్ చేశారు.

అయితే షారుక్ ఖాన్ ఎక్కువగా తన పర్సనల్ విషయాలు బయట చెప్పుకోరు. కానీ గత ఏడాది X లో ఆస్క్ SRK సెషన్ పెట్టారు.అందులో ఒక అభిమాని మీరు గౌరీ ఖాన్ కి మొదటి వాలెంటైన్స్ డే(Valentine's Day) కి ఇచ్చిన బహుమతి ఏంటి అని అడగగా.. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది..నేను గౌరీ ఖాన్ కి పింక్ కలర్ ప్లాస్టిక్ చెవి పోగులను గిఫ్ట్ గా ఇచ్చాను అంటూ చెప్పారు.

Tags:
Next Story
Share it