Sonia Agarwal: మాజీ భర్తను మళ్లీ కలవాలనుకుంటున్న సోనియా అగర్వాల్..!!

నటి సోనియా అగర్వాల్ అంటే ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు. కానీ 7/g బృందావన్ కాలనీ సినిమా చూసిన ఎవరైనా సరే ఈ హీరోయిన్ ని గుర్తుపడతారు. డైరెక్టర్ ఏ. ఎం. రత్నం

Sonia Agarwal: మాజీ భర్తను మళ్లీ కలవాలనుకుంటున్న సోనియా అగర్వాల్..!!
X

న్యూస్ లైన్ డెస్క్: నటి సోనియా అగర్వాల్(Sonia Agarwal) అంటే ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు. కానీ 7/g బృందావన్ కాలనీ సినిమా చూసిన ఎవరైనా సరే ఈ హీరోయిన్ ని గుర్తుపడతారు. డైరెక్టర్ ఏ. ఎం. రత్నం తనయుడు రవి కృష్ణ హీరోగా సోనియా అగర్వాల్ హీరోయిన్ గా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథా సినిమా 7/g బృందావన్ కాలనీ(7/G Brundavana colony)..ఈ సినిమా అప్పట్లో యూత్ ని ఎంత బాగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే ఈ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నాను అంటూ సెల్వ రాఘవన్(Selva raghavan) ఈ మధ్యనే ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే సెల్వ రాఘవన్ సోనియా అగర్వాల్ ఈ సినిమా సమయంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. కానీ కొద్ది సంవత్సరాలకే వీరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే తాజాగా తన మాజీ భర్తతో మళ్ళీ కలవడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పింది సోనియా అగర్వాల్(Sonia Agarwal) . అయితే కలవడం అంటే మళ్ళీ ఆయనతో రిలేషన్ మెయింటైన్ చేయడం కాదు.

అసలు విషయం ఏమిటంటే..సెల్వ రాఘవన్ కేవలం7/g బృందావన్ కాలనీ సీక్వెల్ మాత్రమే కాకుండా ఆయన దర్శకత్వం వహించిన మరొక హిట్ సినిమా ఆయన పుదుపుట్టై (Puduputtai) అనే సినిమాకి కూడా సీక్వెల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ధనుష్ (Dhanush) హీరోగా చేస్తే హీరోయిన్స్ గా స్నేహ(Sneha) , సోనియా అగర్వాల్ చేశారు. అయితే ఈ సినిమాలో మళ్లీ అవకాశం వస్తే మీరు నటిస్తారా అని యాంకర్ అడగగా.. నాకు సెల్వతో పని చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను.. కానీ ఈ సినిమా సీక్వెల్లో నటించమని నన్ను ఎవరు అడగలేదు. నా దగ్గరికి ఎవరు వచ్చి చెప్పలేదు.అలాగే ఆ సినిమా కథ ఏంటో కూడా నాకు తెలియదు అందులో ఎవరు నటిస్తున్నారో కూడా తెలియదు అంటూ సోనియా అగర్వాల్ (Sonia Agarwal) చెప్పింది.

Tags:
Next Story
Share it