Tollywood Actress: అబ్దుల్‌ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా?

పెద్ద ప్రాజెక్ట్స్ చేసిన ఈహీరోయిన్ సురభి పురాణిక్ చిన్నప్పటి అబ్దుల్ కలాం గారి తో దిగిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది .

Tollywood Actress: అబ్దుల్‌ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఈ చిన్న పాప ...ఓ హీరోయిన్ అని చాలా తక్కువ మందికే తెలుసు.. మెగా హీరోతో రొమాన్స్ కూడా చేసింది. అలా అని చిన్నచితకా సినిమాలు చెయ్యలేదు..పెద్ద ప్రాజెక్ట్స్ చేసిన ఈహీరోయిన్ సురభి పురాణిక్( surabhi puranik).. తన చిన్నప్పటి అబ్దుల్ కలాం గారి తో దిగిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఆ పిక్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ఢిల్లీలో చదివిన సురభి( surabhi) తన స్కూల్‌ ఈవెంట్‌కి అబ్దుల్‌ కలాం( abdul kalam) ముఖ్య అతిథిగా వచ్చారట. అదే టైంలో ఆయనతో కలిసి ఇలా ముచ్చటించింది. అయితే తమిళం, తెలుగులో ఎక్కువగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ( beauty) ప్రస్తుతం మంచి కథ కోసం ఎదురు చూస్తుంది.సందీప్ కిషన్ హీరోగా నటించిన బీరువా అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సురభి తన యాక్టింగ్‌, స్క్రీన్‌ ప్రజెన్స్‌( screen presence) తో ఆకట్టుకుంటుంది.




శర్వానంద్‌( sarvanand) తో కలిసి ఎక్స్‌ప్రెస్_రాజా( express raja) లో నటించింది. ఈ సినిమాతో మంచి విజయం సాధించిన ఆమె ఆ వెంటనే 'ఎటాక్', నాని సరసన 'జెంటిల్‌మెన్'‌, అల్లు శిరీష్‌తో 'ఒక్క క్షణం', ( okka kshanam) ఓటరులో హీరోయిన్‌గా అలరించింది. ఇక చివరిగా ఆది సాయి కుమార్‌తో శశి ( sasi) సినిమాలో హీరోయిన్‌గా అలరించింది. నాని తో చేసిన జెంటిల్ మెన్ కూడా చాలా మంచి పేరు తెచ్చింది. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలున్నాయి..కాని కన్నడ లో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సినిమాలున్నాయి కాని ఫేమ్ మాత్రం అనుకున్న స్థాయిలో రావడం లేదు.

Tags:
Next Story
Share it