Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి వల్ల విమర్శల పాలైన సురేఖ..!

ఏంటి లావణ్య త్రిపాటి వల్ల చిరంజీవి భార్య సురేఖని విమర్శలు చేశారా..ఇంతకీ లావణ్య చేసిన తప్పేంటి.. లావణ్య కారణంగా సురేఖ ఎందుకు విమర్శలు పడింది అనే సంగతి ఇప్పుడు

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి వల్ల విమర్శల పాలైన సురేఖ..!
X

న్యూస్ లైన్ డెస్క్: ఏంటి లావణ్య త్రిపాటి(Lavanya Tripathi) వల్ల చిరంజీవి భార్య సురేఖని విమర్శలు చేశారా..ఇంతకీ లావణ్య చేసిన తప్పేంటి.. లావణ్య కారణంగా సురేఖ ఎందుకు విమర్శలు పడింది అనే సంగతి ఇప్పుడు చూద్దాం.మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ ఈ మధ్యనే అత్తమ్మాస్ కిచెన్ అనే పేరు(Attammas kitchen) అనే వెబ్ సైట్ ద్వారా అమ్ముతున్నారు.

అయితే ఈ ఆహార బిజినెస్ లోకి చిరంజీవి భార్య సురేఖ(Surekha) ఆమె బర్త్డే రోజు అడుగుపెట్టింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన (Upasana) అభిమానులతో పంచుకుంది. ఇక అత్తమ్మాస్ కిచెన్ ఇన్స్టా పేజీలో రీసెంట్గా ఆవకాయ పచ్చడి తయారు చేసిన వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే తాజాగా నాగబాబు కోడలు చేసిన పని వల్ల సురేఖ విమర్శల పాలైంది. అసలు విషయం ఏమిటంటే.. రీసెంట్ గా లావణ్య త్రిపాఠి తన అత్త పద్మజ (Padmaja) తో కలిసి ఆవకాయ పచ్చడి కలుపుతున్న వీడియో షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ వీడియో అత్తమ్మాస్ కిచెన్ పేజ్ లో కూడా వైరల్ అవ్వడంతో ఇది చూసిన చాలామంది నెటిజన్స్ అత్తమ్మాస్ కిచెన్లో (Attammas kitchen) అమ్మే ఆవకాయ పచ్చడిని ఇంత దరిద్రంగా తయారు చేస్తారా..


అసలు కొంచెం కూడా శుభ్రత పాటించరా..లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ,పద్మజ ఇద్దరు తమ చేతులకి ఎలాంటి గ్లౌజులు వేసుకోలేదు. అలాగే లావణ్య త్రిపాఠి కూడా తన హెయిర్ లీవ్ చేసింది.ఒకవేళ అందులో హెయిర్ పడితే ఎలా ఉంటుంది అంటూ అత్తమ్మాస్ కిచెన్ పై కొంతమంది విమర్శలు చేశారు. దీంతో వెంటనే స్పందించిన అత్తమ్మాస్ కిచెన్ యూనిట్ అలాంటిదేమీ లేదు.మేము పూర్తిగా హైజినిక్ ప్రొడక్ట్స్ ని అమ్ముతాము. ఇక లావణ్య త్రిపాఠి, పద్మజ(Padmaja) కల్పిన ఆవకాయ పచ్చడి అమ్మడానికి కాదు అది వాళ్ళ ఇంట్లో కోసం తయారు చేసింది. ఇక ఈ విషయంలో మీరు ఎలాంటి భయం పడనక్కర్లేదు. ఎందుకంటే అత్తమ్మాస్ కిచెన్ లో తయారయ్యే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని చాలా జాగ్రత్తలు తీసుకొని,పరిశుభ్రంగా తయారు చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు. ఇలా లావణ్య త్రిపాఠి చేసిన పని వల్ల సురేఖ (Surekha) ఇబ్బందులు పడింది

https://www.instagram.com/p/C66WVeIPLQg/?utm_source=ig_web_copy_link

Tags:
Next Story
Share it