Suresh: రెండో పెళ్లి చేసుకున్నా మొదటి భార్య ఇంటికి వెళ్తుంటాను..!!

ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు సురేష్ ప్రస్తుతం అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈయన

Suresh: రెండో పెళ్లి చేసుకున్నా మొదటి భార్య ఇంటికి వెళ్తుంటాను..!!
X

న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు సురేష్((Suresh) ప్రస్తుతం అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈయన గతంలో సినిమాల్లో హీరోగానే కాకుండా విలన్ గా.. హీరో ఫ్రెండ్గా..అనేక సినిమాల్లో నటించారు. అంతేకాకుండా అరవింద్ స్వామి, అజిత్, నాగార్జున వంటి హీరోలకు డబ్బింగ్ కూడా చెప్పారు.

అయితే సురేష్ అనే పేరు చెప్పగానే అందరికీ అమ్మోరు సినిమా (Ammoru movie) గుర్తుకొస్తుంది.ఈ సినిమాలో సౌందర్య(Soundarya) భర్తగా ఈయన నటించారు. అయితే గత కొద్ది రోజుల నుండి ఇండస్ట్రీకి ఈయన కాస్త దూరంగానే ఉంటున్నారు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన మొదటి పెళ్లి, రెండో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.సురేష్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా మొదటి భార్య పేరు అనిత.. పెళ్లయ్యాక అనిత సురేష్ (Anitha Suresh) అని పేరు మార్చుకుంది. అయితే ఈమె పెళ్లయ్యాక కూడా కొన్ని రోజులు ఇండస్ట్రీలో కొనసాగింది. కానీ చదువు మీద ఇంట్రెస్ట్ తో చదువుకోవాలని ఇండస్ట్రీకి దూరమైంది.

ఇక మా మధ్య ఎలాంటి గొడవలు లేవు.కానీ పై చదువులు చదువుతానని అమెరికా వెళ్తానంది.కానీ నేను ఇక్కడే ఉంటానని డిసైడ్ అయ్యాను. ఈ కారణంతోనే మేమిద్దరం విడాకులు తీసుకున్నాం.అలా ఆమె విడాకులు తీసుకొని అమెరికా (America) వెళ్లి బాగా చదివి అక్కడే సెటిల్ అయింది. అంతేకాదు రెండో పెళ్లి కూడా చేసుకుంది.అలాగే నేను కూడా రెండో పెళ్లి చేసుకున్నాను.అయితే మేమిద్దరం ఎలాంటి గొడవలు పడి విడిపోలేదు. కాబట్టి మా మధ్య బంధం అలాగే ఉంది.

అంతే కాదు ఇప్పటికీ ఆమె తన పేరు నుండి నా పేరు తొలగించలేదు.అనిత సురేష్ అనే పిలిపించుకుంటుంది.అలాగే ఆమె రెండో భర్త నా కొడుకుని బాగా చూసుకుంటాడు. ఇక ఇండియా వచ్చినప్పుడల్లా ఆమె నా ఇంట్లోనే ఉంటుంది. అలాగే నేను అమెరికా వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉంటాను.. మా రిలేషన్ మారింది కానీ మా మధ్య ఆప్యాయత మాత్రం అలాగే ఉంది అంటూ సురేష్ (Suresh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Tags:
Next Story
Share it