Taapsee Pannu : ఘనంగా జరిగిన హీరోయిన్ తాప్సీ వివాహం!

ప్రముఖ హీరోయిన్ తాప్సీ తన ప్రియుడు మథియాస్ బోను ని వివాహమాడారు. గత నెల 23 వ తారీఖున వీళ్లిద్దరు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో బంధు మిత్రుల సమక్షం లో ఒక్కటయ్యారట.

Taapsee Pannu : ఘనంగా జరిగిన హీరోయిన్ తాప్సీ వివాహం!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రముఖ హీరోయిన్ తాప్సీ తన ప్రియుడు మథియాస్ బోను ని వివాహమాడారు. గత నెల 23 వ తారీఖున వీళ్లిద్దరు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో బంధు మిత్రుల సమక్షం లో ఒక్కటయ్యారట. వీళ్లిద్దరి వివాహానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. డెన్మార్క్ కు చెందిన మథియాస్ బోను బ్యాడ్మింటన్ ప్లేయర్ గా ప్రసిద్ధి గాంచారు. గత 9 ఏళ్ళ నుండి తాప్సీ తో ఈయన ప్రేమాయణం నడిపినట్టు తెలుస్తుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాతే వీళ్లిద్దరు జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే పెళ్లి జరిగి ఇన్ని రోజులైనప్పటికీ తాప్సీ సోషల్ మీడియా లో అభిమానులకు ఇంకా ఈ విషయం తెలియచెయ్యకపోవడం గమనార్హం. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వం లో తెరకెక్కిన 'ఝుమ్మంది నాథం' సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా పరిచయమైనా తాప్సీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఆమెకి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

కానీ సక్సెస్ శాతం చాలా తక్కువే. కుర్ర హీరోలు, మీడియం రేంజ్ హీరోలతో ఎక్కువగా సినిమాలు చేసింది కానీ, ఈమె స్టార్ హీరోలలో ఒక్క ప్రభాస్ తో మినహా ఇంకో హీరోతో కలిసి నటించలేదు. తెలుగు లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ, హిందీ లో మాత్రం తాప్సీ వరుస విజయాలను అందుకొని టాప్ హీరోయిన్ గా ఎదిగింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటించిన తాప్సీ నటిగా కూడా మంచి గుర్తింపుని దక్కించుకుంది. ఇటీవలే షారుఖ్ ఖాన్ తో కలిసి 'డుంకీ' అనే చిత్రం లో హీరోయిన్ గా నటించిన తాప్సీ, ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా కొనసాగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు హిందీ సినిమాలు ఉన్నాయి.

Tags:
Next Story
Share it