Ajith : తమిళ హీరో అజిత్ కి కారు ప్రమాదం!

మొదటి నుండి రిస్కీ స్తంట్స్ చెయ్యడానికి అమితాసక్తిని చూపించే అజిత్, తన కొత్త సినిమాలో కూడా ఒక ప్రమాదకరమైన రిస్కీ షాట్ ని చేసారు. కారులో ప్రయాణిస్తుండగా ఆ కారు ఒక్కసారిగా బోల్తా కొట్టి క్రింద పడిపోయింది

Ajith : తమిళ హీరో అజిత్ కి కారు ప్రమాదం!
X

న్యూస్ లైన్, తమిళనాడు: తమిళనాట టాప్ 3 స్టార్ హీరోలలో ఒకరు అజిత్. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో తమిళం లో అజిత్ ఒక్కరే అని అంటూ ఉంటారు. ఆయన చేసే సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వసూళ్లు వస్తుంటాయి. ఆయన గత చిత్రం 'తూనీవు' కూడా నెగటివ్ టాక్ మీద 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి కమర్షియల్ గా సూపర్ హిట్ స్టేటస్ ని అందుకుంది. ఇప్పుడు ఆయన తిరుమేని దర్శకత్వం 'విధా మూయార్చి' అనే సినిమా చేస్తున్నారు. మొదటి నుండి రిస్కీ స్తంట్స్ చెయ్యడానికి అమితాసక్తిని చూపించే అజిత్, ఈ సినిమాలో కూడా ఒక ప్రమాదకరమైన రిస్కీ షాట్ ని చేసారు.

కారులో ప్రయాణిస్తుండగా ఆ కారు ఒక్కసారిగా బోల్తా కొట్టి క్రింద పడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే యూనిట్ సభ్యులు పరుగులు తీసి కారు వద్దకి పోగా, అజిత్ ఎలాంటి గాయాలు లేకుండా బయటకి వచ్చారు. ఆయనతో పాటు ప్రముఖ నటుడు ఆరవ్ కూడా ఉన్నారు. మేమిద్దరం తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నామని ఈ సందర్భంగా ఆరవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అజిత్ కి జరిగిన ఈ ప్రమాదం ని చూసి ఆయన అభిమానులు ఎంతో కంగారు పడ్డారు. దయచేసి ఇలాంటి రిస్కీ షాట్స్ చెయ్యకండి, మీకు ఏమైనా జరిగితే మేము తట్టుకోలేము అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన కి సంబంధించిన వీడియోలను మీరు క్రింద చూడవచ్చు.



Tags:
Next Story
Share it