Chiranjeevi: చిరంజీవి నిద్ర లేవడంతోనే చూసే మొదటి ఫోటో.. ఎవరిదంటే.?

మెగాస్టార్ చిరంజీవి ఉదయం నిద్ర లేవడంతోనే ఆమె మొహమే చూస్తారట.ఇక ఆమె అనగానే అందరికీ చిరంజీవి తల్లి అంజనాదేవి లేకపోతే చిరంజీవి భార్య సురేఖలు మాత్రమే గుర్తుకొస్తారు

Chiranjeevi: చిరంజీవి నిద్ర లేవడంతోనే చూసే మొదటి ఫోటో.. ఎవరిదంటే.?
X

న్యూస్ లైన్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఉదయం నిద్ర లేవడంతోనే ఆమె మొహమే చూస్తారట.ఇక ఆమె అనగానే అందరికీ చిరంజీవి తల్లి అంజనాదేవి లేకపోతే చిరంజీవి భార్య సురేఖలు మాత్రమే గుర్తుకొస్తారు.కానీ ఈ ఇద్దరు కాకుండా చిరంజీవి ఉదయం నిద్ర లేవడంతోనే మరో మహిళ ఫోటో చూస్తారట. మరి ఇంతకీ చిరంజీవి ఉదయం లేవడంతోనే చూసే మొదటి ఫోటో ఎవరిదో ఇప్పుడు తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి ఉదయం నిద్ర లేవడంతోనే దివంగత నటి మహానటి సావిత్రి(Mahanati Savitri) ఫోటోనే చూస్తారట. అంతేకాదు ఆ ఫోటోని తన గదిలో గోడకు ఎదురుగా పెట్టుకున్నారట ఇక ఉదయం నిద్ర లేవడంతోనే మొదట ఆమె ఫోటో చూసే ఆయన రోజు మొదలవుతుందట.ఇక ఈ విషయాన్ని తాజాగా సావిత్రి క్లాసిక్స్ (Savitri Classics) పేరిట బుక్ లాంచ్ చేసిన సమయంలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి (Vijaya Chamundeshwary) స్వయంగా బయట పెట్టింది.తాజాగా మహానటి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి తన తల్లి పేరు మీద సావిత్రి క్లాసిక్స్ అనే బుక్ లాంచ్ చేసింది.


ఇక ఈ బుక్ లాంచ్ ని చిరంజీవి(Chiranjeevi) చేతుల మీదుగా చేసింది.అయితే ఈ ఈవెంట్ ని చిన్నగా చేద్దాం అనుకున్నప్పటికీ చిరంజీవి ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా జరిపించారట.అలాగే ఈ ఈవెంట్లో చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, అలాగే అల్లు అరవింద్,జయసుధ, పరుచూరి గోపాలకృష్ణ,మురళీమోహన్ (Murali mohan) వంటి సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్లో విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ.. నేను ఓ రోజు చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు ఆయన కాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు.ఆ సమయంలో నేను వచ్చాను అని తెలియడంతోనే ఆయన కిందికి వచ్చి నాతో మాట్లాడారు.

అలా మాట్లాడుతుండగా నేను ప్రతిరోజు ఉదయాన్నే లేచి సావిత్రమ్మ (Savitramma) గారి మొహాన్నే చూస్తాను అని చెప్పారు. అయితే ఈ విషయం నేను నమ్మను కావచ్చు అని ఆయన గదిలో ఉన్న మా అమ్మ సావిత్రమ్మ ఫోటో తీసుకువచ్చి మరీ నాకు చూపించారు. అలా చిరంజీవికి మా అమ్మ అంటే అంత అభిమానం..అంటూ విజయ చాముండేశ్వరి చెప్పుకొచ్చింది.ప్రస్తుతం చాముండేశ్వరి మాటలు విన్న చాలామంది నెటిజన్స్ సావిత్రి అంటే చిరంజీవికి అంత అభిమానమా అంటూ కామెంట్లు పెడుతున్నారు

Tags:
Next Story
Share it