రామోజీ మనవరాలితో చివరిగా మాట్లాడిన మాటలివేనట.!

రామోజీరావు మీడియా రంగంలో సంచలనాలు సృష్టించినటువంటి గొప్పదీరుడు. అలాంటి రామోజీరావు ఈనాడు సంస్థలను ఎంతో నిబద్దతతో నడిపారు. అందుకే ఈ స్థాయిలో ఆ సంస్థలు

రామోజీ మనవరాలితో చివరిగా మాట్లాడిన మాటలివేనట.!
X

న్యూస్ లైన్ డెస్క్: రామోజీరావు మీడియా రంగంలో సంచలనాలు సృష్టించినటువంటి గొప్పదీరుడు. అలాంటి రామోజీరావు ఈనాడు సంస్థలను ఎంతో నిబద్దతతో నడిపారు. అందుకే ఈ స్థాయిలో ఆ సంస్థలు ఎదిగాయి. అలాంటి రామోజీరావు కుటుంబం చాలా పెద్దది. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఇందులో పెద్ద కొడుకు కిరణ్ ఈనాడు వ్యవహారాలన్ని చూసుకుంటారు. ఆయన సతీమణి శైలజ మార్గదర్శి వ్యవహారాలన్ని చూస్తారు. ఇక చిన్న కొడుకు సుమన్ ఆయన అనారోగ్యం కారణంగా మరణించిన విషయం అందరికీ తెలుసు. ఆయన సతీమణి పేరు విజయేశ్వరి. ఇందులో పెద్దకొడుకుకు ముగ్గురు సంతానం. రెండో కొడుకు ఇద్దరు. కిరణ్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, రెండో కొడుకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వీరి కుటుంబ సభ్యులు, మనవళ్లు మనవరాలు అంతా తాతయ్యతో చాలా ఆప్యాయంగా ఉండే వారట.

అందులో చిన్న మనవరాలు దివిజ తాత తనతో చివరిగా మాట్లాడిన మాటలను పంచుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. వీరిద్దరి మధ్య ముందుగా తెలుగు రాజకీయాల గురించి వచ్చిందట. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తాతయ్యను ఇలా అడిగిందట ఏపీలో ఎవరు గెలుస్తారు. ఎవరు గెలిచినా ధర్మమే గెలుస్తుంది కదా తాతయ్య అని అన్నాను. దీనికి తాతయ్య ధర్మం ఊరికే గెలవదు దాన్ని రక్షించడానికి చాలామంది పోరాడాలి ఎంతో మంది త్యాగం చేయాలని చెప్పారు.

అదే నాతో తాతయ్య మాట్లాడిన ఆఖరి మాటలు. కడవరకు నిజాయితీగా హ్యాపీగా బతకాలని, పోరాడే తత్వం అలవర్చుకోవాలని తాత తరచూ చెబుతూ ఉండేవాడు. ఆయనకున్న క్రమశిక్షణ స్ఫూర్తి నాలో 10 శాతం ఉన్న సంతృప్తి చెందగలుగుతాను. అంతేకాకుండా తాతయ్య ఆరోగ్యం గురించి మరియు మనం చేసే పనుల గురించి కూడా ఎన్నోసార్లు చెప్పేవారు. అంతేకాకుండా తాను మరణించిన రోజున కన్నీటి బొట్టు కూడా కార్చకూడదని,ఎంత కష్టం లో అయినా ఏడవకూడదని చెప్పినట్లుగా ఆమె తెలియజేసింది. అలాగే తాత మాకిచ్చిన లక్ష్యాలను బాధ్యతలను బాధ్యతగా నెరవేరుస్తామని అన్నది.

Tags:
Next Story
Share it