తనకంటే చిన్న వ్యక్తితో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరోయిన్.!

ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ హీరో హీరోయిన్లు పెళ్లి పీటలెక్కుతున్నారు. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పెళ్లి బాట పడుతున్నారు స్టార్లు.

తనకంటే చిన్న వ్యక్తితో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరోయిన్.!
X

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ హీరో హీరోయిన్లు పెళ్లి పీటలెక్కుతున్నారు. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పెళ్లి బాట పడుతున్నారు స్టార్లు. గత ఏడాది బాలీవుడ్ స్టార్ భామలు అలియాభట్(aliabut) కియారా అద్వాని(kiyara adavani)పరిణీతి చోప్రా(parinithi chopra)వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇదే కోవలోకి మరో స్టార్ హీరోయిన్ కూడా రానుందట. ఆవిడ ఎవరో కాదు సోనాక్షి సిన్హా.

శత్రాజ్ఞాసిన్హ కూతురైన సోనాక్షి దబాంగ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ చిత్రం తర్వాత అంతలా హిట్టు కొట్టిన సినిమా మరోటి ఆమెకు తగలలేదు. అలాంటి ఈ ముద్దుగుమ్మ గత కొన్నాళ్ళ నుంచి జహీర్ ఇక్బాల్ (jahir ikball)తో డేటింగ్ చేస్తున్నది మనందరికీ తెలుసు.ఈ తరుణంలో వారి ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకోబోతున్నారని అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


అంతే కాదు ఈనెల 23న పెళ్లికి కూడా సిద్ధమైనట్టు అనేక వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో కీలక విషయం ఏంటంటే సోనాక్షి సిన్హా(sonakshi Sinha)చేసుకోబోయే అబ్బాయికి తన కంటే రెండు సంవత్సరాలు చిన్నవాడట. అయితే వీరి మధ్య పెళ్లి కుదిరిందని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇక వార్తలు వినిపిస్తున్న తరుణంలో సోనాక్షి సిన్హా తండ్రి స్పందించారు. నా కూతురు పెళ్లి వార్తలు ఎలాంటి నిజం లేదు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం తన కూతురు బరాత్ లో తాను డ్యాన్స్ ఆడతానని ఒప్పుకున్నారు.

Tags:
Next Story
Share it