mega star: బడా నిర్మాతను నట్టేట ముంచేసిన మెగాస్టార్ చిరంజీవి..ఎవరా నిర్మాత

మెగాస్టార్ చాలా మోసం చేశారు. అన్న మాట నిలబెట్టుకోలేదు సరికదా..నట్టేట ముంచేశారు. ఈ మాటలు ఇండస్ట్రీ లో ఓ పెద్ద నిర్మాత స్వయంగా తను రాసుకున్న మాటలు.

mega star: బడా నిర్మాతను నట్టేట ముంచేసిన మెగాస్టార్ చిరంజీవి..ఎవరా నిర్మాత
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మెగాస్టార్ చాలా మోసం చేశారు. అన్న మాట నిలబెట్టుకోలేదు సరికదా..నట్టేట ముంచేశారు. ఈ మాటలు ఇండస్ట్రీ లో ఓ పెద్ద నిర్మాత స్వయంగా తను రాసుకున్న మాటలు. తన ఆటోబయోగ్రఫీలో ఈ వివరాలను రాసుకున్నారు.ప్రముఖ సినీ నిర్మాత, రచయిత ఎంఎస్.రెడ్డి(మల్లెమాల) ( MS REDDY) 'ఇది నా కథ'( EDI NA KATHA) పేరుతో తన ఆత్మకథ రాసి పుస్తక రూపంలో ఆ మధ్య విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకంలో తన సినీ జీవితంతో పాటు పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, గుణశేఖర్ లాంటి వారిపై విమర్శలు చేస్తూ...సాధారణ జనాలకు వారి మనస్తత్వం గురించి తెలియని విషయాలను బట్టబయలు చేశారు.

అందులో భాగంగానే " అంజి "( ANJI) సినిమా తీస్తున్నపుడు ఆ సినిమా నిర్మాత ఎంఎస్ రెడ్డి( MS REDDY) గారి కొడుకు శ్యాం ప్రసాదే నిర్మాత. అంజి స్టోరీ చూసినపుడే సినిమా డౌట్ కొట్టిందట. క్లైమాక్స్ అంతా గ్రాఫిక్స్ మీదే డిపెండ్ అయ్యింది. సినిమా ఫ్లాప్ అయితే ఎలా అని డౌట్ చిరుకు చెప్పారట. దానికి చిరు నా మాట నమ్మండి సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటు భరోసా ఇచ్చారట. అయినా ఫ్లాప్ అయితే నేను, పవన్ కళ్యాణ్ ఇద్దరం ఒక్కొక్క సినిమా ఫ్రీ గా చేస్తాం. అప్పుడు శ్యాం కాస్త ఆర్ధికంగా నిలదొక్కుకుంటాడని చెప్పుకొచ్చాడు. కాని అంజి ఫ్లాప్ అయ్యాక మాత్రం చిరు మాట నిలబెట్టుకోలేదు. తనతో సినిమా చెయ్యలేదు. ఇఫ్పుడు శ్యాం తో చిరు సంబంధాలు బాగున్నాయి కాని మనిషి స్వభావం చెప్తున్నానంటు రాసుకొని వచ్చారు.

ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమలో చీకటి కోణాల్ని కూడా తన పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకం చదివిన వారు ఇండస్ట్రీ పెద్దలపై పెద్ద ఎత్తున దుమారం లేపుతారనే భయంతో ఆ పుస్తకాలను శ్యాం ప్రసాద్ రెడ్డి వెనక్కి తెప్పించేశారు. ఇటీవల ఎంఎస్.రెడ్డి మరణించిన నేపథ్యంలో....ఈ పుస్తకం మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఆ పుస్తకాన్ని దక్కించుకోడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నా...ఎక్కడా దొరకడం లేదు. ఇదే అదునుగా తొలుత ఆ పుస్తకాన్ని దక్కించుకున్న కొందరు వ్యక్తలు, ఆపుస్తకాన్ని మరిన్ని కాపీలు తయారు చేయించి రూ. 10వేల చొప్పున గుట్టు చప్పుడు కాకుండా బ్లాక్‌లో అమ్ముతున్నారని ఇండస్ట్రీ టాక్.

Tags:
Next Story
Share it