MOVIES: భారీ ఆఫర్లు కొట్టేస్తున్న ముగ్గురు బ్యూటీలు!

అక్కడ వరుణ్ ధావన్ జోడీగా ఆమె ఒక సినిమా చేస్తోంది. ఇంకా హిందీలో ఒకటి రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని అంటున్నారు.

MOVIES: భారీ ఆఫర్లు కొట్టేస్తున్న ముగ్గురు బ్యూటీలు!
X

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్( TOLLYWOOD) గా దూసుకుపోయిన కాజల్( KAJAL) , తమన్నా( TAMANNA), అటు టాలీవుడ్ ..తమిళ్ ..బాలీవుడ్ లోను పాగా వేయడానికి గట్టిగానే ట్రై చేశారు. అయితే కూసింత సక్సస్ కూడా అయ్యారు. అయితే వీళ్ల తర్వాత కీర్తి(KEERTHI SURESH) , సాయిపల్లవి, రష్మిక ఇప్పుడు అటు సౌత్ , ఇటు నార్త్ రెండింటిని ఓ చక్రం తిప్పాలని ట్రై చేస్తున్నారు.

రష్మిక .. కీర్తి సురేశ్ .. సాయిపల్లవి( SAIPALLAVI) ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అవుతున్నారు. అటు రష్మిక తెలుగు .. కన్నడ భాషల్లో స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తూనే, బాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచింది. అక్కడ ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించి, 'యానిమల్'( ANIMAL) సినిమా హిట్ తో అక్కడివారి దృష్టిని ఆకర్షించింది. అయితే గ్లామర్ విషయంలో రష్మిక కాస్త డీలా పడింది. అయినా పర్ఫామెన్స్ లో మాత్రం చింపేస్తుంది.దాంతో మరో రెండు హిందీ సినిమాలు ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నాయి. ఈ సినిమాలు హిట్ కొడితే, అక్కడ రష్మిక తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక తమిళ( TAMIL) .. తెలుగు ( TELUGU) భాషల్లో బిజీగా ఉన్న కీర్తి సురేశ్( KEERTHI SURESH) కూడా బాలీవుడ్ ఛాన్సులపై గట్టిగానే దృష్టిపెట్టింది. అక్కడ వరుణ్ ధావన్ జోడీగా ఆమె ఒక సినిమా చేస్తోంది. ఇంకా హిందీలో ఒకటి రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని అంటున్నారు.

తెలుగు .. తమిళ .. మలయాళ( MALAYALAM) ప్రాజెక్టులతో బిజీగా ఉండే సాయిపల్లవి( SAIPALLAVI) కూడా హిందీలో ప్రాజెక్టులను ఒప్పేసుకుంటోంది. 'రామాయణ' తరువాత ఆమె అక్కడ బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. సాయిపల్లవికి బాలీవుడ్ జనాలు ఫిధా అవుతారంటున్నారు నెటిజన్లు..లెట్స్ సీ ...ఏ హీరోయిన్ జెండా ఎగరేస్తుందో.

Tags:
Next Story
Share it