Tom Cruise: లేటు వయసులో ఘాటు ప్రేమ..

టామ్ క్రూజ్.. హాలీవుడ్ సినిమాలు చూసే వారికి ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తన సినిమాలో వరల్డ్ వైడ్ గా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.

Tom Cruise: లేటు వయసులో ఘాటు ప్రేమ..
X

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టామ్ క్రూజ్.. హాలీవుడ్ సినిమాలు చూసే వారికి ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తన సినిమాలో వరల్డ్ వైడ్ గా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ హీరో ఏది చేసినా సెన్సేషనల్ అవుతుంది. ఇప్పుడు హాలీవుడ్ హీరో గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. టామ్ క్రూజ్ నాలుగోసారి ప్రేమలో పడ్డారు. అదీ కూడా.. 61ఏళ్ల వయసులో 36 ఏళ్ల అమ్మాయితో ప్రేమాయణం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్ లో హాట్ టాపిక్ మారింది. అయితే.. ఈ ప్రేమ విషయం గత ఏడాది డిసెంబర్ లోనే బయటకి వచ్చింది.

రష్యాకి చెందిన ప్రముఖ మోడల్ ‘ఎల్సినా ఖైరోవా’ తో టామ్ క్రూజ్ ప్రేమలో పడ్డారట. 2023 డిసెంబర్ లో లండన్ లోని మేఫెయిన్ లో ఈ జంట కలిసి పార్టీలో పాల్గొన్నారు. అప్పటి నుంచే వీరిద్దరి ప్రేమ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాదు.. ఈ జంట ఇటీవల లండర్ లోని ఎయిర్ అంబులెన్స్ ఛారిటీకి మద్దతు ఇచ్చే ఛారిటీ డిన్నర్ లో కూడా కలిసి కనిపించారు. అలాగే లండన్ లోని కొన్ని ప్రత్యేకమైన రెస్టారెంట్ లలో డిన్నర్స్ చేస్తూ, ఎల్సినా ఇంటికి సమీపంలోని హైడ్ పార్క్ లో జంటగా చక్కర్లు కొడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇక తమ ప్రైవసీ దెబ్బతినకుండా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు బయటకి రాకుండా టామ్ క్రూజ్ జాగ్రత్త పడుతున్నారట. కాగా, టామ్ క్రూజ్( tom cruse) , ఎల్సినాతో కలిసి తన అపార్ట్మెంట్ లోనే ఉంటున్నారని టాక్. టామ్ క్రూజ్ కి ఇప్పటికే మూడుసార్లు పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్నారు.

టామ్ క్రూజ్ 1987లో మిమీ రోజర్స్( meme rojars) ని వివాహం చేసుకున్నారు. 1990లో విడాకులు తీసుకున్నారు. తరువాత నికోల్ కిడ్ మాన్ తో కలిసి నడిచి.. 2001 లో విడిపోయారు. 2006లో కేటీ హోమ్స్ ( kate homes) తో రిలేషన్ మొదలు పెట్టిన టామ్ క్రూజ్.. 2012 ఆమెతో విడిపోయారు. 2006లో కేటీ హోమ్స్ తో రిలేషన్ మొదలు పెట్టిన టామ్ క్రూజ్.. 2012లో ఆమెతో విడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఎల్సినా ఖైరోవాతో రిలేషన్ మొదలు పెట్టారు

Tags:
Next Story
Share it