Vishwambhara:18 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ తో చేస్తున్న చిరు..!

మెగాస్టార్ చిరంజీవి ఈ హీరో గురించి మనం ఈ ఒక్క ఆర్టికల్ లో చెప్పలేం. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి పెద్దన్నల

Vishwambhara:18 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ తో చేస్తున్న చిరు..!
X

న్యూస్ లైన్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ఈ హీరో గురించి మనం ఈ ఒక్క ఆర్టికల్ లో చెప్పలేం. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి పెద్దన్నల మారారు. అలాంటి చిరంజీవి(chiranjeevi ఇప్పటికీ ఏడు పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ మరీ సినిమాలో నటిస్తున్నారు. అలా మెగాస్టార్ హీరోగా చేస్తూ తాజాగా రాబోతున్న చిత్రం విశ్వంభర(vishwambhara) ఈ చిత్రాన్ని బింబిసారా డైరెక్టర్ వశిష్ట(wasista) తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం జరుగుతుంది. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్ త్రిష(trisha) నటిస్తోంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఈ బిగ్గెస్ట్ ఫాంటసీ మూవీలో చిరంజీవి చేస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోంది. అలాంటి ఈ సినిమా గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.


ఇందులో త్రిషతో పాటు మరో సీనియర్ హీరోయిన్ కూడా నటిస్తుందట. ఆమె ఎవరో కాదు కుష్బూ(kushboo) అయితే ఈ పాత్ర కోసం మొదటిగా విజయశాంతిని(vijayashanthi) అనుకున్నారట. కానీ ఆమె ఓకే చెప్పకపోవడంతో కుష్బూను ఫైనల్ చేసేసారు. త్వరలో దీనికి సంబంధించిన వార్త కూడా అధికారికంగా బయటకు రానుంది.

Tags:
Next Story
Share it