Nayanthara:ఆ గుడిలో యజ్ఞం చేసిన నయనతార విగ్నేష్ లు.. కారణం.?

నయనతార విజ్ఞేష్ శివన్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్న కోలీవుడ్ సెలబ్రిటీ జంటలలో వీరు కూడా ఒకరు. ఈ జంట పెళ్లి కాకుండానే సహజీవనం చేసి అలాగే పెద్దల సమక్షంలో అంగరంగ

Nayanthara:ఆ గుడిలో యజ్ఞం చేసిన నయనతార విగ్నేష్ లు.. కారణం.?
X

న్యూస్ లైన్ డెస్క్: నయనతార విజ్ఞేష్ శివన్ లు(vignesh shivan) ప్రేమించి పెళ్లి చేసుకున్న కోలీవుడ్ సెలబ్రిటీ జంటలలో వీరు కూడా ఒకరు. ఈ జంట పెళ్లి కాకుండానే సహజీవనం చేసి అలాగే పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరు పెళ్లి చేసుకోకముందు నయనతార గతంలో ప్రభుదేవా(prabhu deva) శింబుతో(shimbu) ఎలా అయితే బ్రేకప్ చెప్పుకుందో విజ్ఞేష్ శివన్ కి కూడా అలాగే బ్రేకప్ చెటబుతుంది అని అందరూ భావించారు.కానీ అందరూ అనుకున్న దానికి భిన్నంగా విజ్ఞేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది.

ఇక ఈ జంట సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకి కూడా జన్మనిచ్చారు. అయితే పెళ్లయ్యాక నయనతార కెరియర్ అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతూ వస్తున్నప్పటికీ తన వైవాహిక బంధాన్ని మాత్రం చాలా సాఫీగా కొనసాగిస్తుంది. అయితే పూజలు, వ్రతాలు, యాగాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే నయనతార తాజాగా ఓ గుడిలో పూజలు చేస్తూ కనిపించింది.అయితే దానికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో నయనతార విజ్ఞేష్ శివన్ లు ఎందుకు పూజ(pooja): చేశారు.. అసలు ఏం పూజ చేశారు..

దానికి కారణం ఏంటి.. వీరిద్దరి మధ్య సఖ్యత లేదా ఏంటి అంటూ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ జంట ఇద్దరు ఓ గుడిలో పూజలో పాల్గొన్నారు. అలాగే ఆ పూజలో పాల్గొన్న సమయంలో ఇద్దరు రెడ్ కలర్ దుస్తుల్లోనే కనిపించారు.అయితే ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ జంట ఏదో యజ్ఞంలో పాల్గొన్నారని,అందుకే ఇద్దరు ఒకే రకమైన దుస్తులు ధరించారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా ఈ జంట మధ్య సఖ్యత లేదు అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తమ వైవాహిక జీవితం బాగుండాలనే ఉద్దేశంతో ఈ పూజలు చేశారని ఒక టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది

Tags:
Next Story
Share it