Vijay:హీరో విజయ్ టెన్త్ మర్క్స్ తెలిస్తే షాకే.?

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. వారందరిలోకెల్లా అత్యధిక అభిమానులను కలిగి ఉన్న హీరో విజయ్ అని చెప్పవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాల్లో

Vijay:హీరో విజయ్ టెన్త్ మర్క్స్ తెలిస్తే షాకే.?
X

న్యూస్ లైన్ డెస్క్: కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. వారందరిలోకెల్లా అత్యధిక అభిమానులను కలిగి ఉన్న హీరో విజయ్ అని చెప్పవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాల్లో నటించక ముందే, ఆయన ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు. అలాంటి విజయ్ కోట్లాది రూపాయల శ్రీమంతుడైన కానీ సదాసీదాగా ఉంటారు. ఎన్నో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాంటి ఈయన గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.

అయితే తాజాగా ఈ స్టార్ హీరో పదో తరగతి మార్కులకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఎవరైనా స్టార్ హీరో పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అభిమానులకు ఉత్సాహం ఉంటుంది. వారి గురించి ఎలాంటి విషయం బయటకు వచ్చిన ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. అలాంటి తమిళ మరియు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చే విజయ్ టెన్త్ క్లాస్ మార్కుల గురించి ఒక వార్త బయటకు వచ్చింది. దీంతో ఆయనకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు.

ఈయన టెన్త్ క్లాస్ సాధారణ పరీక్షల్లో 1100 మార్కులకు గాను 711 మార్కులు సాధించాడట. అయితే ఈయనకు తమిళంలో 200కు 155, గణితంలో 200కు 95, ఇంగ్లీషులో 200కు 133, సైన్స్ లో 300కు 206, సోషల్ సైన్స్ లో 200కు 122 మార్కులు వచ్చాయి. ప్రస్తుతం ఈ మార్కులకు సంబంధించి వార్త బయటకు రావడంతో నెట్టింటా వైరల్ గా మారింది. తాజాగా విజయ్ కోడ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే తలపతి 69 సినిమానే తన చివరి చిత్రంగా చెప్పుకొచ్చి అభిమానులకు షాకిచ్చారు.

Tags:
Next Story
Share it