పరువు తీస్తున్నావ్ అంటూ నాగబాబుకు, చిరు వార్నింగ్ ఇచ్చారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలే ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలో ఇంతమంది

పరువు తీస్తున్నావ్ అంటూ నాగబాబుకు, చిరు వార్నింగ్ ఇచ్చారా..?
X

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలే ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలో ఇంతమంది హీరోలు రావడానికి ప్రధాన కారకులు చిరంజీవి(chiranjeevi )అని చెప్పకనే చెబుతుంటారు. అలాంటి చిరంజీవి వారి యొక్క ఫ్యామిలీకి పెద్దన్నలా ఉంటారు. ఏ విషయంలో కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. చిరంజీవి కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించారు. కేంద్ర మంత్రిగా కూడా చేశారు. ఇన్ని పదవులు అలంకరించినా కానీ ఏనాడు ఎదుటివారిని కించపరిచేలా మాట్లాడలేదు.

మెగా ఫ్యామిలీలో ఉండేటువంటి తన తమ్ముడు నాగబాబు(nagababu) మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో బయటకు వస్తూనే ఉంటాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఎలాగైనా గెలిపించాలని నాగబాబు చాలా కష్టపడ్డారు. అయితే ఆయన పిఠాపురం లోనే ఉండి ప్రచారంలో డైరెక్ట్ గా పాల్గొన్నారు. అలాంటి నాగబాబు ఎలక్షన్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒక ట్విట్ చేశారు. ఆ ట్విట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే ఆ ట్విట్ ను అల్లు అర్జున్ కోసమే పెట్టాడని కొంతమంది భావిస్తూ వస్తున్నారు.ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించి అలా ఎందుకు ట్విట్ చేసావ్ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మన కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే మనమే చక్కదిద్దుకోవాలి దాన్ని రోడ్డు మీద వేయకూడదు అంటూ కోపంగా అడిగారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింటా చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Tags:
Next Story
Share it