ధమాకా కాంబో రిపీట్.. హిట్ పడుతుందా.?

రవితేజ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈయనను మాస్ మహారాజా రవితేజ అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు. అలాంటి రవితేజ ఇండస్ట్రీలో చేయని

ధమాకా కాంబో రిపీట్.. హిట్ పడుతుందా.?
X

న్యూస్ లైన్ డెస్క్: రవితేజ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈయనను మాస్ మహారాజా రవితేజ అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు. అలాంటి రవితేజ ఇండస్ట్రీలో చేయని పాత్రలు లేవు. కామెడీ మాస్ యాక్షన్ ఇలా ఏ పాత్రలో అయినా దూరిపోతారు. అలాంటి మాస్ మహారాజా 75వ సినిమా ప్రకటించబడింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

భాను బోగవరపు డైరెక్షన్ లో రవితేజ హీరోగా 75వ సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రొడక్షన్ నంబర్ 28 గా వస్తోంది. అయితే ఈ సినిమా ద్వారా భాను అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి మరో హైలెట్ ఏంటంటే ఇందులో శ్రీ లీలా హీరోయిన్ గా చేస్తుందట. ఇప్పటికే రవితేజ శ్రీ లీలా కలిసి ధమాకా సినిమాలో నటించారు.

బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో వీరి కాంబోను మళ్లీ రిపీట్ చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఈ సినిమాలో శ్రీ లీలాను హీరోయిన్గా తీసుకుంటున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రం జూన్ 11న 7:29 గంటలకు పూజ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంది. ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ నడుస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించారు. దీంతో రవితేజ అభిమానులు సంబరపడిపోతున్నారు.

Tags:
Next Story
Share it