ANKUSAM: అంకుశం సినిమా నేను ఆయనకే అంకితం ఇస్తా

MS రెడ్డిగారు రాసుకున్న పుస్తకం లో ఎన్నో వేల అనుభవాలు.మరెన్నో సినిమా కష్టాలు ..ప్రతి సినిమా హిట్టు నిర్మాత , దర్శకుల టెన్షన్లు భలే కళ్ల కు కట్టినట్లు చూపించారు

ANKUSAM: అంకుశం సినిమా నేను ఆయనకే అంకితం ఇస్తా
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: MS రెడ్డి( MS REDDY) గారు రాసుకున్న పుస్తకం లో ఎన్నో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నో వేల అనుభవాలు..మరెన్నో సినిమా కష్టాలు ..ప్రతి సినిమా హిట్టు నిర్మాత , దర్శకుల టెన్షన్లు భలే కళ్ల కు కట్టినట్లు చూపించారు కాదు రాసుకున్నారు. అయితే అంకుశం( ANKUSAM) సినిమా చేస్తున్నపుడు ఎదురైన అనుభవాలను ఆ పుస్తకంలో రాసుకున్నారు.

నిజ జీవితంలో దంపతులైన రాజశేఖర్( RAJSHEKAR), జీవితలు చిత్రంలో లీడ్ రోల్స్. విలన్‌గా నటించిన రామిడిరెడ్డి ఈ సినిమాతో అంకుశం రామిరెడ్డి ( RAMIREDDY) అయిపోయారు. రామిరెడ్డి ఆహార్యానికి తగినట్టు విలన్ ( VILLAN) పాత్ర బలమైనది కావడంతో -హీరో రాజశేఖర్ పోలీస్ పాత్రకు మరింత ప్రాధాన్యత చేకూరింది. ఎంఎస్ రెడ్డి (మల్లెమాల) పోషించిన రాజకీయ పాత్ర (ముఖ్యమంత్రి), తరువాతి తరాలకు రాజకీయాలపై సదభిప్రాయం కలిగించేదిగా ఉండటం మరో విశేషం.

పొలిటీషియన్స్‌ను( POLITICAL CRIMINALS) క్రిమినల్స్‌గా చూపించే ధోరణి సినిమాల్లో నడుస్తున్న టైంలో -ఓ గొప్ప ముఖ్యమంత్రి పాత్రను దర్శకుడు కోడి రామకృష్ణ అద్భుతంగా రూపొందించి సినిమా సక్సెస్‌కు కారణమయ్యారు. అయితే ఆ సినిమా లో ముఖ్యమంత్రి పాత్ర చాలా బలమైనదే కాదు..ఎన్నో తరాలకు గుర్తుండిపోయే క్యారక్టర్. అయితే ఈ క్యారక్టర్ ను ఎమ్ ఎస్ రెడ్డి గారికి కోడి రామకృష్ణగారు చెప్పినపుడు ..రెడ్డి గారు నో చెప్పారట. ఎందుకంటే అంత వరకు ఆయన ఎప్పుడు నటించలేదు. ఇప్పుడు ఎలా నటిస్తానో తెలీదు కాబట్టి వద్దని చెప్పారట. కాని లేదు ...మేకప్ వెయ్యడం కాని విగ్గులు కాని ..ఉండవు. మీరు రోజు వేసుకునే బట్టలే వేసుకొండి. మీకు కుదిరినపుడే చెయ్యండని చెప్పడం తో ఒప్పుకొని నటించారట. సినిమా సూపర్ హిట్టు. అందుకే ఆ సినిమా క్రెడిట్ ను కోడి రామకృష్ణకే ఇస్తానని ఆ పుస్తకంలో రాసుకున్నారు. అంకుశం చిత్రం అప్పట్లో చాలా జీవితాలపై ప్రభావం చూపించిందన్నది నిజం.

Tags:
Next Story
Share it