Bihar: బీహార్ లో నేడు నితీష్ సర్కార్ కు బలపరీక్ష

బీహార్ (Bihar) రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు Nda కూటమికి దూరంగా ఉన్న... బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్

Bihar: బీహార్ లో నేడు నితీష్ సర్కార్ కు బలపరీక్ష
X

Bihar: బీహార్ (Bihar) రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు Nda కూటమికి దూరంగా ఉన్న... బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nithish Kumar)... ఇప్పుడు మళ్లీ ఆ కూటమిలో చేరిపోయారు. అయితే నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఇవాళ బీహార్ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు , ఆర్జేడీ అలాగే జేడీయూ సహా వివిధ పార్టీలు వారిని గృహనిర్బంధంలో ఉంచారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి బీహార్ రాష్ట్రంలో 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఇక ఇప్పటివరకు లెక్కలు చూసుకున్నట్లయితే... బిజెపి ఎమ్మెల్యేలు 78 మంది ఉన్నారు. జేడీయూ ఎమ్మెల్యేలు 45 మంది ఉన్నారు.

హెచ్ ఏఎం సభ్యులు నలుగురు, ఐఎన్ డి సభ్యులు ఒకరు.. NDA కూటమికి మొగ్గు చూపుతున్నారు. ఈ లెక్కన... NDA కూటమికి 128 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అటు మహాగట్ బంధన్ పేరుతో ఒక్కటైనా కూటమికి మొత్తం 114 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ లెక్కన బీహార్ రాష్ట్రంలో... మరోసారి నితీష్ కుమార్ (Nithish Kumar) ముఖ్యమంత్రి కాబోతున్నారని స్పష్టం అవుతోంది. దీనిపై మరికాసేపట్లోనే క్లారిటీ రానుంది.

Tags:
Next Story
Share it