Bihar : బీహార్ లో బలపరీక్ష..స్పీకర్ పై అనర్హత వేటు?

బీహార్ అసెంబ్లీ లో బలపరీక్ష జరగబోతున్న ఈ నేపథ్యం లో కొన్ని నాటకీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. స్పీకర్, ఆర్జేడీ నేత అవధ్ బిహారీ చౌదరీ పై అక్కడి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అనర్హత వేటు వేసింది.

Bihar : బీహార్ లో బలపరీక్ష..స్పీకర్ పై అనర్హత వేటు?
X

న్యూస్ లైన్, బీహార్ : బీహార్ అసెంబ్లీ లో బలపరీక్ష జరగబోతున్న ఈ నేపథ్యం లో కొన్ని నాటకీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. స్పీకర్, ఆర్జేడీ నేత అవధ్ బిహారీ చౌదరీ పై అక్కడి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అనర్హత వేటు వేసింది. ఇప్పుడు అసెంబ్లీ లో ఈ తీర్మానం పై బలపరీక్ష ఉత్కంఠ ని లేపుతుంది. ఆర్జేడీ పార్టీ కి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు నీలం దేవి, చేతన్ ఆనంద్ చివరి నిమిషంలో ఎన్డీయే పార్టీ కి మద్దత్తు తెలిపి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఆర్జేడీ పార్టీ కార్యకర్తలు తీవ్రమైన నిరసన వ్యక్తం చెయ్యడం తో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది ఇలా ఉండగా బీహార్ లో ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి అవసరమైన మ్యాజిక్ నెంబర్ 122. ఇక్కడ ఎన్డీయే కి 128 స్థానాలు వచ్చాయి, అలాగే మహాకూటమి కి 113 స్థానాలు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఎవరు స్థాపించబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.

Tags:
Next Story
Share it