Rajiv Gandhi: దేశం దాటిన రాజీవ్‌గాంధీ హ‌త్య కేసు దోషులు

రాజీవ్‌గాంధీ హ‌త్య కేసు దోషులు పక్కా దేశానికి వెళ్లి పోయారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులు బుధవారం ఉదయం కొలంబో

Rajiv Gandhi: దేశం దాటిన రాజీవ్‌గాంధీ హ‌త్య కేసు దోషులు
X

Rajiv Gandhi: రాజీవ్‌గాంధీ హ‌త్య కేసు దోషులు పక్కా దేశానికి వెళ్లి పోయారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులు బుధవారం ఉదయం కొలంబో వెళ్లారు. ఈ ముగ్గురు దోషులు శ్రీలంకలోని కొలంబో కు తాజాగా చేరుకున్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో 2022 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏకంగా ఆరుగురు దోషులను రిలీజ్ చేసింది.

అయితే ఇందులోని ఆ దోషులను రిలీజ్ అయిన తర్వాత తిరుచి రాపల్లి లో ఉన్న ప్రత్యేక క్యాంపులో ఉంచారు. వారు జైలులో ఉన్నప్పుడు సత్పప్రవర్తన కనబరిచారని పేర్కొంది తమిళనాడు ప్రభుత్వం. ఇక ఈ ముగ్గురు వ్యక్తులు తిరుచిరాపల్లిలోని ప్రత్యేక శిబిరం నుంచి ఈ ఉదయం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి నేరు శ్రీలంకలోని కొలంబో కు చేరుకున్నారు.

Tags:
Next Story
Share it