Rahul : రాహుల్ గాంధీ ఆస్తులెన్నో తెలుసా...? ఆయనకు అది కూడా లేదంట...!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తమ తమ

Rahul : రాహుల్ గాంధీ ఆస్తులెన్నో తెలుసా...?  ఆయనకు అది కూడా లేదంట...!
X

Rahul Gandhi: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తమ తమ అభ్యర్థులను ప్రకటించి ముందుకు సాగుతున్నాయి. ఇక ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో... కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandh)... కేరళలోని వయనాడు నుంచి పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలోనే ఆయన తాజాగా నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి తన అఫీడవిట్ ను అందించారు. ఇందులో తన అప్పులు, ఆస్తులు, పూర్తి వివరాలు పొందుపరిచారు రాహుల్ గాంధీ. అయితే ఈ అఫిడవిట్ చూస్తే మనకు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అసలు రాహుల్ గాంధీకి కారు గాని, సొంత ఇల్లు కూడా లేదట. రాహుల్ గాంధీకి ప్రస్తుతం 20 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నట్లు తన అఫీడవిట్ లో స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. అలాగే తనకు సొంత కారు, ఫ్లాట్ లేవని ఆయన వివరించారు. ఇక రాహుల్ గాంధీ అఫిడబిట్ ప్రకారం... అతని దగ్గర కేవలం... 55 వేల రూపాయలు నగదు మాత్రమే ఉందట.

15.21 లక్షల గోల్డ్ బాండ్లు ఉన్నాయట. అంతేకాకుండా నాలుగు.20 లక్షల విలువైన నగలు ఉన్నాయని ఆయన తెలిపారు. బ్యాంకుల్లో 26 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నాయట. అంతేకాకుండా 11.15 కోట్ల విలువైన స్థిరాస్తులు కలిగి ఉన్నారట రాహుల్ గాంధీ. తనకు వారసత్వంగా వ్యవసాయ భూమి మాత్రమే వచ్చిందని ఆయన అఫీడవిట్ లో స్పష్టం చేశారు. ఓవరాల్గా మొత్తం రాహుల్ గాంధీ ఆస్తులు 20 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. అటు రాహుల్ గాంధీ పైన చట్టం కింద చేసుకోవడం నమోదు అయింది.

Tags:
Next Story
Share it