Delhi : ఢిల్లీలో ఉద్రికత్త.. టియర్ గ్యాస్ ప్రయోగం

ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు (Farmers) చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. శంభూ సరిహద్దు వద్దకు భారీగా రైతులు తరలి రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీం

Delhi : ఢిల్లీలో ఉద్రికత్త.. టియర్ గ్యాస్ ప్రయోగం
X

Delhi : ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు (Farmers) చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. శంభూ సరిహద్దు వద్దకు భారీగా రైతులు తరలి రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోకుండా రైతులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అన్నదాతలు పరుగులు తీశారు. అయినా వెనక్కి తగ్గేది లేదని, ఢిల్లీని ముట్టడించి తీరుతామని స్పష్టం చేశారు. ఇక అటు రైతుల నిరసన కార్యక్రమం నేపథ్యంలో ఢిల్లీలో (Delhi ) భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రైతుల చలో ఢిల్లీతో (Delhi ) రహదారులను మూసివేశారు పోలీసులు.. రైతుల ఆందోళ‌న నేప‌థ్యంలో రోడ్లపై నిలిచిపోయాయి వాహనాలు.

కాగా, మూడేళ్ల కిందట సాగు చట్టాల రద్దు సమయంలో కేంద్రం మరికొన్ని డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు వాటి గురించే రైతులు మరోసారి పోరాటం చేస్తున్నారు. 'కనీస మద్దతు ధర, ఉద్యమ సమయంలో పెట్టిన కేసుల ఎత్తివేత, లఖింపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన వారి కుటుంబీకులకు ఉద్యోగాలు, గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని కేంద్రం చెప్పింది. వాటిని అమలు చేయాలి' అని రైతు సంఘాల నేతలు నిరసన చేపట్టారు.

ఇక సాగు చట్టాల రద్దు సమయంలో కేంద్రం రైతులకు ఇచ్చిన అతిపెద్ద హామీ మరొకటి ఉంది. స్వామినాథన్ కమిషన్ (Swaminathan Commission) సిఫారసుల మేరకు పంటలకు కనీస మద్దతు ధరలు అందజేస్తామని తెలిపింది. సాగు పైన ఖర్చుకు ఒకటిన్నర రైతుకు చెల్లించాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసింది. కానీ ఆ హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. ఇప్పుడు అదే అంశం రైతు సంఘాలు తెరపైకి తీసుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే నిరసనలు తెలుపుతున్నాయి రైతు సంఘాలు.

Tags:
Next Story
Share it